Charmy Kaur: "లైగర్" పూర్తయ్యే సమయానికి తమ వద్ద రూపాయి లేదు..

Charmy Kaur: యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు.

Update: 2022-08-20 13:30 GMT
Charmme Gets Emotional in Liger Movie Interview

Charmy Kaur: "లైగర్" పూర్తయ్యే సమయానికి తమ వద్ద రూపాయి లేదు..

  • whatsapp icon

Charmy Kaur: యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 25న తెలుగులో మాత్రమే కాక హిందీ, తమిళ్, కన్నడ, మరియు మలయాళం భాషలలో కూడా విడుదల కాబోతోంది.

అనన్య కి ఇది మొదటి తెలుగు సినిమా కాగా విజయ్ కి ఇది మొదటి హిందీ సినిమా కాబోతోంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చార్మి కౌర్ ఎమోషనల్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సినిమా షూటింగ్ పూర్తయ్యే సరికి మా దగ్గర డబ్బులు అన్నీ అయిపోయాయి. ఆ సమయంలో ఓటీటీ ల నుండి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ థియేటర్ లలో నే విడుదల చేయాలని మేము ఆ ఆఫర్ లను రిజెక్ట్ చేశాము. దానికి చాలా గట్స్ కావాలి," అని అన్నారు చార్మి. అంతేకాకుండా "సినిమాకి ఆగస్టు 25 విడుదల తేదీ ఖరారు అయ్యే ముందు వరకు నేను మరియు పూరి గారు చాలాసార్లు ఏడ్చేశాము. ఆ సమయంలో విజయ్ దేవరకొండ మాకు అండగా నిలబడ్డాడు," అని చెప్పుకొచ్చింది చార్మి.

Tags:    

Similar News