ముంబైలో పవర్ కట్ : మహారాష్ట్ర సర్కార్ పై కంగనా కౌంటర్!
Mumbai Power Cut :మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. నిన్న(సోమవారం) దేశావాణిజ్య రాజధాని ముంబైలో కొన్ని గంటల పాటు పవర్ కట్ అయింది.
Mumbai Power Cut :మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. నిన్న(సోమవారం) దేశావాణిజ్య రాజధాని ముంబైలో కొన్ని గంటల పాటు పవర్ కట్ అయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ సమస్య వలన ముంబై అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో నగర ప్రజలు విద్యుత్ సమస్యపైన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేస్తూ వచ్చారు. అయితే నటి కంగనా మాత్రం మహారాష్ట్ర సర్కార్ పైన వ్యగ్యంగా స్పందించింది. బాలీవుడ్ కమేడియన్ కునాల్ కమ్రాతో కలిసి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుల్డోజర్ బొమ్మ పట్టుకున్న ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ముంబైలో పవర్ కట్.. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం.. (ఇలా ఆడుకుంటోంది) అంటూ ట్వీట్ చేసింది కంగనా.. రాష్ట్ర ప్రభుత్వ పనికి ఇదో నిదర్శనం అంతో పరోక్షంగా కామెంట్స్ చేసింది కంగనా.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత మహా సర్కార్ పైన, ముంబై పోలీసుల పైన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది కంగనా.. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చింది కంగనా.. ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కంగనా పైన మండిపడ్డారు. దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఈ క్రమంలోని సెప్టెంబర్ 9 న ముంబైలోని ఆమె కార్యాలయాన్ని అక్రమంగా ఉందంటూ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు కొంత భాగాన్ని కూల్చి వేశారు. దీంతో అదే రోజున కంగనా ముంబై హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ ఎస్.జె. కథవల్లా నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతను నిలిపివేసింది. ఇక ఈ పిటిషన్ లో కంగనా తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు గాను బీఎంసీ తనకు రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని తన పిటిషన్ లో కోరింది.