యంగ్ రెబెల్ స్టార్ చుట్టూ రాజకీయం.. ప్రభాస్‌తోనూ బీజేపీ మాస్టర్ ప్లాన్...?
Prabhas: ప్రభాస్ సినిమాల నిర్మాణం వెనుక బిజెపి..!!!
Prabhas: గత కొన్ని రోజులుగా తెలంగాణలో, బిజెపి బలోపేతం దిశగా జరుగుతోన్న ప్లానింగ్స్‌లో సినీ తారలతో బిజెపి అగ్ర నాయకత్వం జరిపిన మీటింగ్ లే ఎక్కువ హైలెట్ అయ్యాయి. ఎన్టీఆర్ , నితిన్‌ల అనంతరం ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై బిజెపి నాయకత్వం ఫోకస్ పెట్టిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణంరాజు కుటుంబానికి సంతాపాన్ని తెలిపెందుకు ఢిల్లీ నాయకులోచ్చినా, జరుగుతున్న ప్రచారం మాత్రం వెరేలా ఉంది.
సినీ రాజకీయ రంగాల మధ్య ఇప్పుడు గ్యాప్ పూర్తిగా తొలగిపోయింది. తెలుగు నాట ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేశారో అప్పటి నుంచే దూరం తగ్గిపోయింది. అన్నగారి అడుగు జాడల్లో మరికొందరు సినీ ప్రముఖులు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవినాభావ సంబంధం ఏర్పడింది. క్రమ క్రమంగా ఈ బంధం బలపడిందే కానీ.. తగ్గిపోలేదు. సీనియర్ స్టార్స్ రాజకీయాల్లో ఉన్నారు. వారసులు కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తుంటంతో రాజకీయాలు, సినీ ఇండస్ట్రీ చుట్టూ ఏదో ఒక రూపంలోనే తిరుగుతున్నాయి.
సీనియర్ నటులు, నిర్మాత కృష్ణంరాజు ఇటీవల కన్నుమూశారు. ఆయన బీజేపీ పార్టీతో ఎక్కువగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. చివరి రోజుల్లో బీజేపీ పార్టీకి చాలా దగ్గరగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆయన్ని గవర్నర్‌గా కూడా నియమిస్తారనే వార్తలు బలంగా పుట్టుకొచ్చాయి. కానీ కృష్ణంరాజు కున్న అనారోగ్య సమస్యలవల్లే అలాంటిదేమీ జరగలేదన్న ప్రచారం జరిగింది. కృష్ణంరాజు చనిపోయిన తర్వాత ఆయనపై బీజేపీ జెండాను కప్పారు. ఇది చూసిన వారు జాతీయ పార్టీ.. కేంద్రంలో అధికార పీఠంపై ఉన్న పార్టీ ఇప్పుడు కృష్ణంరాజు సినీ వారసుడైన ప్రభాస్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న పలు సినిమాల నిర్మాణం వెనుక.. బిజెపి నాయకత్వం ఉందన్న మాటలు కేటిఆర్ లాంటి యువ నాయకుల నుంచే వినిపించాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ప్రభాస్‌కున్న ఫాలోయింగ్ ను తమకు అనుకూలంగా మలుచుకునెందుకు బిజెపి డిసైడ్ అయినట్లే కన్పిస్తొంది. ఓ విధంగా యంగ్ రెబెల్ స్టార్ చుట్టూ రాజీకీయం నడుస్తోందనిపిస్తొంది.