Alia Bhatt: లేడీస్ కూడా వ్యూస్ కోసం ఇలా చేయడం సిగ్గుచేటు.. పుకార్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

Alia Bhatt: సోషల్ మీడియాలో తనపై వస్తున్న పుకార్లపై బాలివుడ్ నటి ఆలియా భట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ఆలియా భట్.

Update: 2024-10-25 14:00 GMT

Alia Bhatt: సోషల్ మీడియాలో తనపై వస్తున్న పుకార్లపై బాలివుడ్ నటి ఆలియా భట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు ఆలియా భట్. అయితే ఈ భామకు కొన్ని రోజులుగా ట్రోలర్స్ చుక్కలు చూపిస్తున్నట్లు సమాచారం. ఆమె ఇటీవల బొటాక్స్ ట్రీట్ మెంట్ చేసుకుని ముఖం అంతా పెరాలసిస్ కు గురైందని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అందుకే ఆమె ఎక్కువగా బయటకు రావడంలేదని పుకార్లు వైరల్ చేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి.. ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని.. జీగ్రా మూవీ రిలీజ్ వేడుకల్లో ఆమె ముఖం కాస్తంత భిన్నంగా కన్పించిందని కూడా రూమర్స్ వ్యాప్తి చేశారు. రూమర్స్ పై స్పందించిన ఆలియా ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. దీంతో ఆమె చేసిన పోస్ట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

గత కొన్ని రోజులుగా తన శరీరంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేవారికి ఆలియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేసేముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎలాంటి నిర్థారణ చేయకుండా ఇలాంటి రూమర్స్ సృస్టించి వీరంతా తమాషాలు చేస్తున్నారా..? ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎదుటి వ్యక్తులపై ఇలాంటి కామెంట్స్ చేయడం నేరం అని మీకు తెలియదా.. అని ప్రశ్నించారు. కేవలం వ్యూస్ కోసం ఇలా చేయడంలో అర్ధం లేదని.. ఇలాంటి కామెంట్స్ చేసేవారిలో మహిళలు కూడా ఉండడం సిగ్గుచేటన్నారు ఆలియా.

ఆధారాలు లేకుండా అర్థం పర్థంలేని రూమర్స్ ఎందుకు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. పెరాలసిస్ ఎఫెక్ట్ అయిందని, బాడీ షేమింగ్ కు సంబంధించి ఇష్టమొచ్చినట్టు రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పనిగట్టుకుని ఇటీవల ఫేమస్ పర్సనాలిటీస్ పై లేని పోని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికే చాలామంది ఫేమస్ నటీ, నటులు సైతం ఈ ట్రోలర్స్ బారినపడి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారని.. రూమర్స్ వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే ఇలాంటి ట్రోల్స్ పై ఆలియా స్పందించడం ఇదేం తొలిసారి కాదు. ప్రముఖ దర్శక, నిర్మాత మహేష్ భట్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన ఆలియా.. తనపై ఎక్కువగా విద్వేశపూరితమైన పోస్టులు పెడుతున్నారని.. అవి తన దృష్టికి వచ్చాయని గతంలోనూ తెలిపారు. ఇదిలా ఉండగా ఆలియా భట్ ఇటీవల జీగ్రా మూవీలో నటించారు. ఆలియా, వేదాంగ్ రైనాలు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తోంది.

Tags:    

Similar News