అసలు ఏమాత్రం పాపులారిటీ లేని దర్శకుడు అయినప్పటికీ ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే వరుసగా బోలెడు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు వస్తాయి. అప్పటికే మంచి కాన పేరున్న దర్శకుడు సుకుమార్ 'రంగస్థలం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేసింది ఈ చిత్రం. అయినప్పటికీ సుకుమార్ తదుపరి సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ల కాకపోవడం గమనార్హం. 'రంగస్థలం' విడుదలై సంవత్సరం దాటింది. ఈ సినిమా తర్వాత నిజానికి మహేష్ బాబుతో సుక్కు సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. అల్లు అర్జున్ తో ఒక సినిమాను ప్రకటించాడు సుకుమార్.
బన్నీ-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వీరి సినిమా సెట్స్ పైకి వెళుతుంది. కానీ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు కూడా కాలేదు. ఇక ఏ సినిమా పూర్తయ్యే సరికి కనీసం 6 నెలలు పడుతుంది. పోనీ కనీసం తన అసిస్టెంట్లను దర్శకులుగా మారుస్తూ నిర్మాణ వ్యవహారాలు చూసుకుందాం అనుకున్నాడు కానీ నాగశౌర్య హీరోగా శరత్ మరార్ నిర్మాత గా అసిస్టెంట్ తో తెరకెక్కించాల్సిన సినిమా ఆగిపోయింది. నితిన్ తో ఒక సినిమా కూడా అలాగే క్యాన్సిల్ అయింది. ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సినిమా మాత్రమే ఉంది సుకుమార్ చేతిలో ఉంది. 'రంగస్థలం' తర్వాత సుకుమార్ ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకున్నారు కానీ సుకుమార్ అక్కడే ఉన్నాడు అన్నమాట.