కన్నుమూసిన అన్నమయ్య నిర్మాత దొరస్వామి రాజు

తెలుగు సినీ పరిశ్రమకు మరో విషాదం. అన్నమయ్య, సింహాద్రి వంటి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన వి.దొరస్వామి రాజు కన్నుమూశారు.

Update: 2021-01-18 05:01 GMT

దొరస్వామి రాజు (ఫైల్ ఫోటో)

తెలుగు సినీ పరిశ్రమకు మరో విషాదం. అన్నమయ్య, సింహాద్రి వంటి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన వి.దొరస్వామి రాజు కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా తలెత్తిన అనారోగ్యంతో అయన బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో కొద్దికాలంగా చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం అయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

దొరస్వామిరాజు పంపిణీదారుడుగా తన సినీ వ్యాపారాన్ని ప్రారంభించారు. వీఎంసీ పేరుతొ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థను ప్రారంభించిన అయన ఎన్నో విజయవంతమైన సినిమాలను తన సంస్థ ద్వారా విడుదల చేశారు. ఆయన కెరీర్ ప్రారంభం ఎన్టీఅర్ సింహబలుడు తో జరిగింది. తరువాత ఎన్టీఅర్ సినిమాలు డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఆయన సంస్థ ద్వారా విడుదల అయ్యాయి.

అటు తరువాత నిర్మాతగా మారిన దొరస్వామి రాజు తన వీఎంసీ బేనర్ పై సితారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలేపెళ్లాం వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.

ఎన్టీఅర్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆయన 90లలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన 1994లో నగరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పలు కీలక పదువుల్లోనూ కొనసాగారు. కాకతాళీయమైనా ఎన్టీఅర్ వర్ధంతి రోజే దొరస్వామిరాజు కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం సినీ పరిశ్రమను విషాదంలో ముంచేసింది. 

Tags:    

Similar News