Anand Mahindra: కలలు కనడం మానొద్దు.. ప్రభాస్ 'బుజ్జి' పనిచేసేది.. ఆ టెక్నాలజీతోనే..

Anand Mahindra: హీరో ప్రభాస్- నాగ్‌ అశ్విన్ కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడీ.

Update: 2024-05-24 06:41 GMT

Anand Mahindra: కలలు కనడం మానొద్దు.. ప్రభాస్ 'బుజ్జి' పనిచేసేది.. ఆ టెక్నాలజీతోనే..

Anand Mahindra: హీరో ప్రభాస్- నాగ్‌ అశ్విన్ కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడీ. కల్కి సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్‌తో నడిపే కారు(బుజ్జి)ని అభిమానులకు పరిచయం చేశారు. దీని కోసం భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రభాస్‌నే స్వయంగా బుజ్జిని డ్రైవింగ్ చేస్తూ స్టేజ్‌ పైకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఎక్కడ చూసిన బుజ్జి.. బుజ్జి అనే టాక్ నడుస్తోంది. ఈ బుజ్జి ఎక్కడ తయారైంది? ఎవరు తయారు చేశారు? అనే విషయాలను నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ సందర్భంలో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటే ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తాజాగా ఓ ట్వీట్ చేశారు.

గతంలో నాగ్ అశ్విన్ పెట్టిన ట్వీట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ.. “నిజానికి సరదా సంగతులు ట్విట్టర్ లోనే కనిపిస్తాయి. నాగ్ అశ్విన్.. అతడి టీమ్ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాహనాలు తయారు చేయడంలో కల్కి చిత్రయూనిట్ చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ సహయపడుతుంది. బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఇ- మోటర్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది ” అని చెప్పుకొచ్చారు.

మహీంద్రా ట్వీట్‌పై దర్శకుడు స్పందిస్తూ.. అసాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారంటూ థాంక్స్‌ చెప్పారు. ‘కలలు కనడం మానొద్దు..’ అంటూ మహీంద్రా రిప్లై ఇచ్చారు.

Tags:    

Similar News