సౌత్ లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అమీ జాక్సన్ త్వరలో పెళ్లాడనుంది. గత కొంత కాలంగా ఈమె బ్రిటన్‌కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అయిన జార్జ్ పనాయొటోతో డేటింగ్లో ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా జాంబియాలో విరిద్దరు నిశ్చితార్దం కూడా జరుపుకున్నారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియుడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన అమీ '1 జనవరి 2019.. మన జీవితాల్లో కొత్త ప్రయాణం. ఐ లవ్యూ. నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు' అని కాప్షన్ పెట్టింది.
అయితే తాజా సమాచారం వచ్చే ఏడాది ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రీకు సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. మైకొనాస్ ఐలాంగ్ ప్రాంతంలో ఓ విల్లాని బుక్ చేసుకోవాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే వీరిది బీచ్ సైడ్ వెడ్డింగ్ అన్నమాట. పెళ్లి తర్వాత ఈ జంట యూఎస్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటుందని సమాచారం. చివరిగా '2.0' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమీ పెళ్లి తరువాత సినిమాలకు దూరమవుతుందో లేదో అని తెలియాల్సి ఉంది.