అమృతం సిరియల్ అభిమానులకు గుడ్ న్యూస్

అమృతం తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. ఇద్దరు స్నేహితులు, ఇంటి ఓనర్ వారితో కలిసి అమృతం అనే ఆ హోటల్ సర్వర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.

Update: 2020-01-10 11:43 GMT

అమృతం తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. ఇద్దరు స్నేహితులు, ఇంటి ఓనర్ వారితో కలిసి అమృతం అనే ఆ హోటల్ సర్వర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. వీరంతా పండించిన కామెడీ అభిమానులకు పొట్టచెక్కలైయ్యేలా నవ్వించింది. అమృతం సిరియల్ కి పోటీగా వచ్చిన సంబరాల రాంబాబు వంటి ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేకపోయాయి. అయితే అప్పట్లో వచ్చిన ఈ సిరియల్ బుల్లితెర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పటికి ఆ పాత్ర దారులు ఏ సినిమాలో కనిపించిన వారిని అమృతం సిరియల్ లోని పాత్రల పేరుతోనే పిలుస్తారు. అయితే అమృతం సిరియల్ అభిమానులకు మరోసారి శుభవార్త అందిస్తున్నారు. దాదాపు ఏనిమిదేళ్లపాటు టెలివిజన్ ప్రేక్షకులను అలరించిన ఈ సిరియల్ కొనసాగింపు రానుందని తెలుస్తోంది.

అమృతం సిరీయల్ కొనసాగింపు మాత్రం టీవీలో కాదు నెట్టింట్లో రానుందని తెలుస్తోంది. అయితే తాజాగా జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ద్వారా రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరియల్ వెబ్ సిరీస్ తీయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ వెబ్ విజయవంతం అయితే ఛానల్ లో కూడా ప్రసారం అయ్యే ఆలోచన చేస్తుందని తెలుస్తోంది. అమృతం డైరెక్టర్ గుణ్ణం గుణ్ణం గంగరాజు దర్శకత్వంలోనే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఆ సిరియల్ పాత్రదారుల్లో అంజనేయులు ( అంజి ) పాత్రదారి గుండు హనుమంతరావు అనారోగ్యం కారణంతో మరణించిన సంగతి తెలిసిందే. రాబోయే అమృతం సిరియల్లో అప్పాజీ, సర్వం, పాత్రధారులు ఉన్నప్పటికి వారు ఈ సిరిస్ లో కూడా నటిస్తారా?. లేక చందమామలో అమృతం చిత్రంలో నటించిన పాత్రధారులు ఇందులో ఉంటారా‎? అనేది ఇంకా తేలియలేదు.

మరోవైపు 2000 సంవత్సరంలో వచ్చి అమృతం సిరియల్ సమయంలో ఏటువంటి కామెడీ సిరియల్స్ లేవు. దీంతో అమృతం అప్పట్లో పెద్ద సక్సెస్ అయింది. కానీ. అనేక కామెడీ సిరియల్స్ ఉన్నాయి. ఓ ప్రముఖ టీవీ చానల్ పలు కామెడీ సిరియస్ ను ప్రతి రోజు ప్రసారం చేస్తుంది. అలాగే కొన్ని టీవీ ప్రొగ్రామ్స్, వెబ్ సిరీస్ లు కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమృతం సిరియల్ అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అనేది ప్రశ్నార్థకమే. అఈ సిరియల్ పూర్తి తర్వాత మళ్లి తెరకెక్కించమని గతంలో నిర్మాతలు చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో అమృతం సిరియన్ ని టెలికాస్ట్ చేసిన ఓ ప్రముఖ టెలివిజన్ చానల్ అమృతం 2 తీయాలనే ప్రయత్నాలు చేసింది. అందుకు నిర్మాతలు ఓకే చెప్పకపోవడంతో విరమించుకుందని టాక్ వినిపించింది. అమృతం వెబ్ సిరీస్ విజయవంతం కావాలంటే ఇప్పటి ప్రేక్షకులు అనుగుణంగా కాన్సెప్ట్ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చిన అభిమానుల నుంచి విమర్శలు తప్పవు. 

Tags:    

Similar News