Pushpa 2: బన్నీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. పుష్ప2లో ఇంకొన్ని కొత్త సీన్స్

Pushpa 2: ఈ సినిమాలో మరికొన్ని సన్నివేశాలు యాడ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి థియేటర్లలో కొత్త సీన్లతో పుష్ప 2 సినిమా ప్రదర్శితం కానుందని తెలుస్తోంది.

Update: 2024-12-29 06:45 GMT

Pushpa 2: బన్నీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. పుష్ప2లో ఇంకొన్ని కొత్త సీన్స్

Pushpa 2: అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సంచలనం సృష్టించింది. విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. ఓవైపు వివాదాలు చుట్టు ముట్టినా మరోవైపు కలెక్షన్ల సునామినీ కొనసాగిస్తూనే ఉంది. ఇండస్ట్రీ రికార్డులను ఈ సినిమా తిరగరాసింది.

అల్లుఅర్జున్‌ అద్భుత నటన, సుకుమార్ మార్క్‌ దర్శకత్వం సినిమాను విజయతీరాలకు చేర్చింది. ఒక్క బాలీవుడ్‌లోనే ఈ సినిమా ఏకంగా రూ. 800 కోట్లను రాబట్టి బీటౌన్‌లో సరికొత్త రికార్డును సృష్టించిందీ మూవీ. ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన పుష్ప2 చిత్రం రూ. 1800 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. బాహుబలి 2 మూవీ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్‌ను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో మరికొన్ని సన్నివేశాలు యాడ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి థియేటర్లలో కొత్త సీన్లతో పుష్ప 2 సినిమా ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఈ సన్నివేశాలకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నాడని సమాచారం. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బన్నీ డబ్బింగ్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప2 రన్‌టైమ్‌ సుమారు 3.15 గంటలు ఉండగా లెంగ్త్‌ ఎక్కువగా ఉండడంతో కొన్ని సన్నివేశాలు కట్‌ చేశారని తెలుస్తోంది.

ఇప్పుడు వీటిని సినిమాలో యాడ్ చేయనున్నారని తెలుస్తోంది. సుమారు 20 నిమిషాల సన్నివేశాలను యాడ్‌ చేయనున్నారు. అయితే ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సన్నివేశాలను యాడ్ చేయాలని భావించారు. అయితే డిజిటల్ స్ట్రీమింగ్‌కు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో థియేట్రికల్ వెర్షన్ లోనే వీటిని జతచేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి. 

Tags:    

Similar News