Pushpa2: పుష్ప2 మరోసారి వాయిదా పడనుందా.? క్లారిటీ ఇచ్చిన బన్నీ..
అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ అధికారికంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 వాయిదా పడదని తేల్చి చెప్పారు.
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శతక్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప2: ది రూల్. పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. తొలి పార్ట్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకోవడంతో సుకుమార్ సీక్వెల్‌పై మరింత దృష్టిసారించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
దీంతో పుష్ప సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలుసార్లు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. ఇక తాజాగా ఈచిత్రాన్ని డిసెంబర్ 6వ తేదీన తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడనుంది అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు.
అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ అధికారికంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 వాయిదా పడదని తేల్చి చెప్పారు. డిసెంబర్ 6వ తేదీన సినిమా కచ్చితంగా థియేటర్లలోకి వచ్చి తీరుతుందని అన్నారు. తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న అల్ల అర్జున్ ఈ విషయాన్ని తెలిపారు. కచ్చితంగా డిసెంబర్ 6న ఈ చిత్రం విడుదలవుతుందని బన్నీ స్పష్టంచేశారు. కొన్ని సన్నివేశాలు ఒక్క రోజులో చేయాల్సింది రెండు రోజుల సమయం పట్టిందన్నారు. పుష్ప2 అభిమానుల కోసం తీస్తున్న సినిమా అన్నారు.
ఇక ఇదే ఈవెంట్లో పాల్గొన్న దర్శకుడు సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పారు. ‘అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో ఆర్య-ఆర్య2, అలాగే పుష్ప-పుష్ప2 ఇలా అన్నీ రెండు పార్టులుగానే వస్తాయా’ అని సుమ అడగ్గా.. ‘పార్ట్ 1, 2 మాత్రమే కాదు.. 3, 4, 5 భాగాలు కూడా రావచ్చు అని సుకుమార్ నవ్వుతూ సమాధానం చెప్పారు. అయితే నిజంగానే సుకుమార్ ఏమైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారా అన్న సందేహం అభిమానుల్లో మొదలైంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి.