Samantha: 'ఆ సమయంలో తల తిరిగేది'.. సమంత షాకింగ్ వ్యాఖ్యలు..!
Samantha: విడాకుల తర్వాత నటి సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Samantha: విడాకుల తర్వాత నటి సమంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓవైపు వ్యక్తిగత జీవితం మరోవైపు ఆరోగ్యం ఆమెను ఇబ్బందికి గురి చేశాయి. మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధితో ఓ రకంగా పోరాటమే చేశారని చెప్పాలి. వ్యాధితో ఇబ్బంది పడ్డ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని తాజాగా చెప్పుకొచ్చారు సమంత.
వివరాల్లోకివెళితే.. చాలా రోజుల తర్వాత సమంత స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఖుషీ మూవీ తర్వాత సామ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇదిలా ఉంటే సమంత ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్ని’ స్ట్రీమింగ్‌కు సిద్దమవుతోంది. నవంబర్ 7వ తేదీ నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది.
ఇందులో భాగంగానే తాజాగా సమంత పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. 'నేను ఇప్పటివరకు పనిచేసిన అత్యంత కష్టమైన ప్రాజెక్ట్ ‘సిటాడెల్’. ఈ టీమ్ నాలో ధైర్యాన్ని నింపింది. ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటూ మద్దతునిచ్చింది. నాపై ఎంతో నమ్మకంతో ఈ సిరీస్‌ను కొనసాగించింది. వారికి నాపై నమ్మకం లేకుంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. జీవితంలో మనం కష్టాలను ఎదుర్కొనే సమయంలో దేవుడు కచ్చితంగా సాయం చేస్తాడు. ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి సాయం చేసిన వారిని మనం ఎల్లప్పుడూ గుర్తుచుకోవాలి. వారిపై కృతజ్ఞతా భావంతో ఉండాలి' అని సామ్ చెప్పుకొచ్చారు.
రాజ్ అండ్ డీకేతో పాటు సిరీస్ యూనిట్ అంత తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని సమంత చెప్పుకొచ్చారు. ఇంత మంచి టీమ్ దొరికినందుకు తాను ఎంత అదృష్టవంతురాలినో అని అనిపించందన్నారు. 'కొన్ని సందర్భాల్లో షూటింగ్ సమయంలో తల తిరిగేది, నావల్ల కాదు అనిపించేది. అయినా ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాను' అని గతం గురించి చెప్పుకొచ్చింది సామ్. మరి సిటాడెల్ సమంతకు పూర్వ వైభవం తీసుకొస్తుందా.? సామ్ మళ్లీ సినిమాలతో బిజీగా మారుతుందా.? చూడాలి.