Rakul: ఆ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయా.. రకుల్‌ సంచలన వ్యాఖ్యలు..!

Rakul: 2011లో వచ్చిన 'కెరటం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్‌. అయితే ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు లభించలేదని చెప్పాలి.

Update: 2024-09-12 05:49 GMT

Rakul: ఆ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయా.. రకుల్‌ సంచలన వ్యాఖ్యలు..!

Rakul Preet Singh opens up on Nepotism: 2011లో వచ్చిన 'కెరటం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్‌. అయితే ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు లభించలేదని చెప్పాలి. కానీ 2013లో వచ్చి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మూవీతో ఒక్కసారిగా అందరి చూపును తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. ఈ సినిమాతో టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. రామ్‌చరణ్‌, మహేష్‌బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ చివరిగా ఇండియన్‌ 2 చిత్రంలో కనిపించింది.

ఇక ప్రస్తుతం ఇండియన్‌3 మూవీతో పాటు, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా తన కెరీర్‌లో ఎదురైన కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. ఏ విషయంపై అయినా ముక్కు సూటిగా మాట్లాడే రకుల్‌.. తాజాగా నెపొటిజంపై తనదైన శైలిలో ఓపెన్‌ అయ్యింది.

సినిమా ఇండస్ట్రీలో నెపొటిజం ఉంటుందనేది బహిరంగ రహస్యమే. రకుల్ సైతం ఇదే విషయాన్ని తెలిపింది. ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్నమాట వాస్తవమేనని. ఈ కారణంగా తాను కెరీర్‌లో అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమాలు తనకు దక్కలేదని బాధ పడలేదని, ఆ సినిమాలు తనను ఉద్దేశించినవి కాదని ముందుకుసాగానని చెప్పుకొచ్చింది.

తన తండ్రి సైన్యంలో పనిచేసే వారని, ఆయన సలహాలు, అనుభవం నాకు ఎన్నో నేర్పాయని చెప్పుకొచ్చింది. అవకాశాలు కోల్పోవడం కూడా జీవితంలో ఓ భాగమని, దక్కని వాటి గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోనని మంచి ఫిలాసఫిని చెప్పుకొచ్చింది రకుల్‌. ఏం చేస్తే వ్యక్తిగతంగా ఎదుగుతానో దానిపై మాత్రమే శ్రద్ధ పెడతానని, స్టార్‌ కిడ్‌కు లభించినంత సులభంగా మిగతా వారికి ఛాన్స్‌లు రావు. అదంతా వారి తల్లిదండ్రుల కష్టం అని రకుల్‌ మనసులో మాట బయటపెట్టింది.

Tags:    

Similar News