Acharya Movie Team : ఆ వార్తలు పూర్తిగా నిరాధారం : ఆచార్య టీం క్లారిటీ!

Acharya Movie Team : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా చిరంజీవి

Update: 2020-08-27 12:20 GMT
Acharya Movie Team : ఆ వార్తలు పూర్తిగా నిరాధారం : ఆచార్య టీం క్లారిటీ!

Chiranjeevi

  • whatsapp icon

Acharya Movie Team : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇక్కడే సినిమాని కొన్ని వివాదాలు వెంటాడాయి.. ఈ కథ నాది అంటూ కొందరు యువ రచయితలు కాపీ ఆరోప‌ణ‌లు చేశారు. అయితే తాజాగా దీనిపైన చిత్ర నిర్మాతల్లో ఒకరైనా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆఫీషియల్ గా ఓ ప్రకటనని విడుదల చేసింది..

" ఆచార్య కథ మాది అంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు.. ఇది ఒరిజిన‌ల్ క‌థ‌. ఈ కథ పూర్తిగా కొర‌టాల శివ‌కు మాత్రమే చెందుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి మంచి క్రేజ్ వచ్చింది.. ఈ క్రేజ్ చూసి కొంద‌రు ర‌చ‌యితలు ఇది వారి క‌థే అంటూ త‌ప్పుడు ఆరోప‌ణలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా క‌థ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. కేవలం మోషన్ పోస్టర్ ని చూసి కథ మాది అని అనుకుంటున్నారు. కొర‌టాల శివ‌లాంటి దిగ్గజ ద‌ర్శకుల‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌దు. "అంటూ అందులో వెల్లడించింది. దీనితో సినిమా పైన వస్తున్న ఆరోపణలకి చెక్ పెట్టినట్టు అయింది.



కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

Tags:    

Similar News