Mr Bachchan: మిస్టర్‌ బచ్చన్‌ రిజల్ట్‌తో.. హరీశ్‌ శంకర్‌ కీలక నిర్ణయం.?

Harish Shanker: హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-09-07 05:42 GMT

Mr Bachchan: మిస్టర్‌ బచ్చన్‌ రిజల్ట్‌తో.. హరీశ్‌ శంకర్‌ కీలక నిర్ణయం.?

Harish Shanker: హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. హరీష్‌ శంకర్‌, రవితేజ కాంబినేషన్‌లో మూడవ చిత్రంగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని చెప్పాలి.

అంచనాలను అందుకోవడంలో మిస్టర్‌ బచ్చన్‌ విఫలమైందని చెప్పాలి. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డా, థియేటర్లలో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయిందీ మూవీ. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మిస్టర్‌ బచ్చన్‌ సినిమా రిజల్ట్ కారణంగా హరీష్‌ శంకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం మేరకు హరీష్‌ శంకర్‌ మిస్టర్‌ బచ్చన్‌ కోసం తీసుకున్న తన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని తిరిగి ఇంచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత రూ. 2 కోట్లు ఇచ్చిన ఆ తర్వాత మిగతా మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ వార్తల్లో నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

కాగా ఈ సినిమా బాలీవుడ్‌లో వచ్చిన రైడ్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కథ కంటే హీరోయిన్‌నే హైలెట్‌ చేశారనే విమర్శలు ఎదురయ్యాయి. ఇక మిస్టర్‌ బచ్చన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సమయం దగ్గరపడుతున్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 

Tags:    

Similar News