Live Updates: ఈరోజు (14 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-14 01:15 GMT
Live Updates - Page 2
2020-10-14 05:52 GMT

Amaravati updates: కరోనా చికిత్స పొందుతున్న శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ...

అమరావతి....

-బెంగుళూరు మణిపాల్ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ.

-నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నా.కుటుంబ సభ్యుల సూచన మేరకు ముందస్తు జాగ్రత్త కోసం మాత్రమే ఆసుపత్రిలో చేరడం జరిగింది.

-నేను ఆసుపత్రిలో ఉన్నా సరే తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా.

-వర్షాలు అధికంగా కురవడం, ఎర్రకాలువ ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ముందుగానే అధికారులను అప్రమత్తం చేస్తూ సమన్వయం చేస్తున్నా.

-ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా.

-ఉదయం 11 గంటలకు నియోజకవర్గ పరిధిలోని అన్ని డిపార్ట్మెంట్ ల అధికారులతో కార్యాచరణపై జూమ్ యాప్ లో వీడియో కాలింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నా.

-దయచేసి ఎవరూ బయపడవల్సిన పనిలేదు.సంపూర్ణ ఆరోగ్యంతో కొద్దిరోజుల లొనే తిరిగి వచ్చేస్తా.

-కొట్టు సత్యనారాయణ(శాసనసభ్యులు,ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్)

2020-10-14 04:58 GMT

Krishna District updates: గన్నవరం మండలం కేసరపల్లిలో డివైడర్ ఎక్కిన కారు...

కృష్ణాజిల్లా...

-నిద్ర మత్తులో డ్రైవింగ్ చేసిన డ్రైవరు

-పరారీలో డ్రైవర్

-గంజాయి లోడుతో నిండి ఉన్న కారు

-కారు నంబరు AP11X5152 ఆధారంగా దర్యాప్తు

2020-10-14 04:53 GMT

Krishna River updates: ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి...

విజయవాడ..

-వరద ఉధృతి పై అధికారులను అప్రమత్తం చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ .

-ఉదయం 9.00 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

-ప్రస్తుత ఇన్ ఫ్లో 5,64,770, అవుట్ ఫ్లో 5,64,604 క్యూసెక్కులు

-వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్.

-చంద్రర్లపాడు నుంచి ఇబ్రహీంపట్నం వరకు తహసీల్దార్ల్ అప్రమత్తంగా ఉండాలి.

-చినలంక, పెదలంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

-పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 6,46,747,అవుట్ ఫ్లో 5,34,933 క్యూసెక్స్.

-కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

-వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు.

-వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదు .

2020-10-14 04:37 GMT

Visakha Weather updates: మరో నాలుగు రోజుల పాటు ఏపి లో వర్షాలు...

విశాఖ...

-మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం...

-ఇది క్రమంగా తెలంగాణ మీదకు గంటకు 17 కీ.మీ వేగంతో పయనిస్తోంది.

-దీని ప్రభావంతో తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి ఉంటాయి.

-ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు...

-రాయలసీమలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు..

-మత్స్యకారులు కు కొనసాగుతున్న హెచ్చరికలు...

-తీరం వెంబడి గంట కు 55-65 కీ మీ వేగం తో గాలులు..

-సముద్రం లో అలల 4.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం..

2020-10-14 03:05 GMT

Visakha Weather updates: భారీ వర్షాల కారణంగా మేహాద్రి జలాశయంలో గరిస్ట స్థాయికి నీటీ మట్టం...

విశాఖ..

-345 క్యూసెక్కులు నీటీనీ దిగువకు విడుదల చేసిన అధికారులు.

-గరిష్ట నీటి మట్టం 60 అడుగులు..

-ప్రస్తుతం 59.7 అడుగులకు అంఈరు చేరడంతో గేట్లు ఎత్తి నీటీనీ విడుదల ఛేసిన అధికారులు

2020-10-14 02:37 GMT

Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

తిరుమల సమాచారం..

-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,977 మంది భక్తులు

-తలనీలాలు సమర్పించిన 6,037 మంది భక్తులు

-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.62 కోట్లు

2020-10-14 02:13 GMT

Rajahmundry Weather updates: భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న పోలవరం, పుష్కర కాలువలు..

తూర్పుగోదావరి -రాజమండ్రి -జగ్గంపేట..

-జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న పోలవరం, పుష్కర కాలువలు.

-రామవరం వద్ద జాతీయ రహదారిపై నుంచి దాటి గ్రామాన్ని ముంచెత్తుతున్న నీరు

-భయం గుప్పెట్లో రామవరం పరిసర గ్రామాల ప్రజలు

-జాతీయరహదారిపై పెద్దవాహనాలు మినహా చిన్నవాహానాలు వెళ్ళలేని పరిస్థితి...

-రాకపోకలకు తీవ్ర అంతరాయం

Tags:    

Similar News