Krishna River updates: ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి...
విజయవాడ..
-వరద ఉధృతి పై అధికారులను అప్రమత్తం చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ .
-ఉదయం 9.00 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ
-ప్రస్తుత ఇన్ ఫ్లో 5,64,770, అవుట్ ఫ్లో 5,64,604 క్యూసెక్కులు
-వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్.
-చంద్రర్లపాడు నుంచి ఇబ్రహీంపట్నం వరకు తహసీల్దార్ల్ అప్రమత్తంగా ఉండాలి.
-చినలంక, పెదలంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
-పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 6,46,747,అవుట్ ఫ్లో 5,34,933 క్యూసెక్స్.
-కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
-వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు.
-వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదు .
Update: 2020-10-14 04:53 GMT