Budget 2024 Live Updates: బడ్జెట్‌ 2024 లైవ్‌ అప్‌డేట్స్‌.. ఆదాయ పన్ను స్లాబ్ లో మార్పులు

Update: 2024-07-23 05:20 GMT
Live Updates - Page 2
2024-07-23 05:45 GMT

వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి: నిర్మలా

నాలుగు అంశాలపై ఈ బడ్జెట్ లో ఫోకస్ పెట్టినట్టుగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించినట్టుగా చెప్పారు. ఉద్యోగాలు, స్కిల్, ఎంఎస్ఎంఈలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో ఆమె తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

2024-07-23 05:42 GMT

వరుసగా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్

మోదీ కేబినెట్ లో ఆర్ధికమంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఎక్కువసార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన రికార్డును ఆమె స్వంతం చేసుకున్నారు. మోదీ సర్కార్ కు ఇది 13వ బడ్జెట్.

2024-07-23 05:42 GMT

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం

2024-07-23 05:31 GMT

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం పదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 86 పాయింట్ల నష్టంతో 80, 415 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు దిగువకు పడిపోయి 24,463 వద్ద కొనసాగుతోంది.

2024-07-23 05:25 GMT

బడ్జెట్ లో ముఖ్యాంశాలు ఇవీ...

కేంద్ర బడ్జెట్ 2024-25 కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. 2019 నుంచి వరుసగా కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టి ఆమె చరిత్ర సృష్టించారు.

2024-07-23 05:24 GMT

Budget 2024: బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Tags:    

Similar News