Live Updates: ఈరోజు (మే-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-30 00:42 GMT
Live Updates - Page 2
2020-05-30 05:34 GMT

తెలంగాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లాక్ డౌన్‌ను జూన్ 6 వరకు పొడిగింపు చేశారు. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్‌ను జూన్ 6 వరకు పొడిగించినట్లుగా హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

-పూర్తి కథనం

2020-05-30 05:27 GMT

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం..

-భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది.

-భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

-వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

-గ‌త 24 గంట‌ల్లో 7,964 కేసులు..

-పూర్తి కథనం

2020-05-30 05:24 GMT

తెలంగాణ లోని పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం

-తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించాయి.

-పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ, మరఠ్వాడా మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతుంది.

-పూర్తి కథనం

2020-05-30 04:55 GMT

ఏపీలో మరిన్ని లాక్ డౌన్ మినహాయింపులు

కరోనా వైరస్ లాక్ డౌన్ నాలుగో దశ గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న వేళ జగన్ సర్కార్ తాజాగా లాక్ డౌన్‌కు సంబంధించి రాష్ట్రంలో ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది.

-పూర్తి కథనం

2020-05-30 04:53 GMT

ఏపీలో భారీగా తగ్గిన పీజీ వైద్య విద్య ఫీజులు

-ఏపీలో పీజీ వైద్య విద్య కోర్సుల ఫీజులను ప్రభుత్వం భారీగా తగ్గించింది.

-వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

-2020–21 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్యార్థుల అడ్మిషన్లు దగ్గర పడిన నేపథ్యంలో ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

-పూర్తి కథనం


2020-05-30 01:19 GMT

జూన్ 1 నాటికీ కేరళను తాకనున్న రుతుపవనాలు

వాయుగుండంగా మారనున్నపశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం.

అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది.

అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని అనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.

వీటి ప్రభావంతో జూన్‌ 1వ తేదీనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

శుక్రవారం మధ్యాహ్నం నుంచి కోస్తాలో పలుచోట్ల వాతావరణ అనిశ్చితి ఏర్పడి క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించాయి.

దీంతో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి.  

Tags:    

Similar News