జూన్ 1 నాటికీ కేరళను తాకనున్న రుతుపవనాలు
వాయుగుండంగా మారనున్నపశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం.
అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది.
అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని అనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.
వీటి ప్రభావంతో జూన్ 1వ తేదీనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి కోస్తాలో పలుచోట్ల వాతావరణ అనిశ్చితి ఏర్పడి క్యుములోనింబస్ మేఘాలు ఆవరించాయి.
దీంతో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి.
Update: 2020-05-30 01:19 GMT