Live Updates: ఈరోజు (మే-29-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
తెలంగానాలోకి మరికొద్ది గంటల్లో మిడతల దండు.. అప్రమత్తమైన అధికారులు!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
* గోదావరి పరివాహక ప్రాంత సరిహద్దులోకి మరికొద్ది గంటల్లో మిడతల దండు ప్రవేశించనున్నట్టు సమాచారం.
* అప్రమత్తమైన అధికార యంత్రాంగం.
* వీటి ప్రవేశాన్ని అడ్డగించేందుకు క్లోరిఫైరిఫాస్ 50 ఈసీ మందును సిద్ధం చేసిన అధికారులు.
* పిచికారీ చేసేందుకు 22 డ్రోన్లను సిద్ధం చేసినట్టు కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ హజీమ్ వెల్లడి.
ఎండ దెబ్బకు దగ్ధమైన వాహనం
- నిర్మల్ జిల్లా కిబీర్ మండలం , ధోడర్న్ 2 గ్రామ శివారులో అగ్ని ప్రమాదం.
- ఎండ తీవ్రతకు దగ్ధమైన సరుకుతో ఉన్న వాహనం.
- అగ్నికి ఆహుతైన జొన్నలు, ఉల్లి, గోధుమలు.
- రైతు జాదవ్ సునీల్ పొలం నుంచి తీసుకొస్తుండగా జరిగిన ఘటన.
- మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు జీవోలను కొట్టివేసిన హైకోర్టు
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు తీర్పు
- ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కొట్టి పారేసిన హైకోర్టు
- ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ కొట్టివేసిన హైకోర్టు
- రమేశ్ కుమార్ ని కమిషనర్ గా నియమించాలని ఆదేశాలు - పూర్తి వివరాలు
భారత్‌పై కరోనా వైరస్ పంజా
భారత్‌పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు కాగా, మృతిచెందారు.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కాగా, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 4,706 మంది మృతిచెందారు. ప్రస్తుతం 89,987 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో, గుజరాత్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.
ఏపీలో ప్రారంభమైన అయిదో విడత ఉచిత రేషన్ పంపిణీ
- కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పిడిఎఫ్ బియ్యం, కేజీ కందిపప్పు.
- రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ.
- రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు.
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది.
- కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి.
- పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్.
- రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు.
మర్రిపాడు నెల్లూరు ముంబయి జాతీయ రహదారిపై మర్రిపాడు సెంటర్కు కొద్ది దూరంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
చిత్తూరు జిల్లా కుప్పం..లారీ ద్విచక్రవాహణం ఢీకొని ఒక్కరు మృతి మరొకరి పరిస్థితి విషమం.
కుప్పం మండలం మునస్వామిపురం క్రాస్ జాతీయరహదరి పై రాత్రి సమయంలో అతి వేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మణస్వామిపురం గ్రామానికి చెందిన గణపతి 27 ఆకడిఅక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం.
కృష్ణా జిల్లా నిడమానూరు స్కూల్ కి ప్రభుత్వ నిధులు మంజూరు
విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి కి ప్రభుత్వం నుండి 93,46,782/-రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. జి
ల్లా పరిషత్ పాఠశాల కు సంబంధించిన స్కూల్ మనేజ్మెంట్ కమిటీ అద్వర్యంలో ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా కమిటీ పర్యవేక్షణ లో పనులు జరగాలని కమిటీ నిర్ణయించింది.
ఈ సందర్భంగా కమిటీ కో ఆప్షన్ షేక్.రసూల్ మాట్లాడుతూ మన నిడమానూరు గ్రామంలో ని పాఠశాల కు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.
హైదరాబాద్ లో మళ్ళీ చిరుత ప్రత్యక్షం!
కొన్ని రోజుల క్రితం రాజేంద్రనగర్, కాటేదాన్ వద్ద జాతీయ రహదారిపై జనాన్ని హడలెత్తించి పరుగులు పెట్టించి తప్పించుకుపోయిన చిరుత మళ్ళీ ప్రత్యక్షం అయింది.
సరిగ్గా ఎక్కడైతే చిరుత కనిపించకుండా పోయిందో ఆ ప్రదేశానికి కొంచెం దగ్గరలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత కదలికలు నిన్న అర్థరాత్రి దాటిన తరువాత కనిపించింది.
కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు
సిద్దిపేట జిల్లా..
* జగదేవ్పూర్ మండలం కొండ పోచమ్మ దేవాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.
* కేసీఆర్ దంపతులకు పూలు చల్లి స్వాగతం పలికిన చాట్లపల్లి గ్రామస్తులు.
* జగదేవ్పూర్ మండలం, చాట్లపల్లి వద్ద కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు.
* కొంచపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు.
* నవ చండి యాగం లో పాల్గొన్న సీఎం.