Live Updates: ఈరోజు (మే-29-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
* వరంగల్ అర్బన్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు
* పెండ్యాల సమీపంలో ధర్మాసాగర్ బీదర్ నుంచి రెండు కార్లలో తరలిస్తున్న రూ. 15 లక్షల అంబర్ గుట్కా ప్యాకెట్ లు పట్టివేత.
* గుట్కా ప్యాకెట్ లతో పాటు రెండు కార్లు స్వాధీనం.
* నలుగురు అరెస్టు.
తెలంగాణాలో కొండపోచమ్మ జలాశయం ప్రారంభం నేడే!
తెలంగాణా లో గోదావరీ జలాల ఎత్తిపోతల పథకం కొండపోచమ్మ జలాశయం ఈరోజు ప్రారంభం కానుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జలాశయాన్ని శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో ప్రారంభిస్తారు.
దీనికోసం కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం, మర్కూక్ పంపుహౌస్ వద్ద సుదర్శన హోమం నిర్వహిస్తారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిన జీయార్ స్వామి హాజరుకానున్నారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
నిమ్మగడ్డ రమేష్ కేసులో తీర్పు నేడు?
- ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కేసులో ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది.
- సోమవారం నుంచి కోర్టుకు వేసవిసెలవులు కావడంతో ఈ కేసులో తీర్పు ఈరోజు వెలువడ వచ్చని భావిస్తున్నారు.
- అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారం పై కూడా హైకోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
- నిన్న ఏపీ సీస్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
- అయితే, ఈ విషయంలో ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ కు వెళ్ళింది.
- ఈ నేపధ్యంలో ఈ కేసు విషయంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.