Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-26 00:51 GMT
Live Updates - Page 3
2020-05-26 04:29 GMT

- వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ప్రమాదం.

- గ్రామానికి చెందిన కంటెం ఈశ్వరమ్మ 60 సం, వృద్ధురాలు బావిలో పడి మృతి.

- కుటుంబ కలహాలే కారణమంటున్న గ్రామస్తులు

2020-05-26 04:26 GMT

నాకు క్వారంటైన్ నిబంధనలు వర్తించవు : కేంద్ర మంత్రి

- కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి డి.వి.సదానందగౌడ ఢిల్లీ నుంచి బెంగళూరు ప్రత్యెక విమానంలో వచ్చారు. 

- నేరుగా ఆయన తన నివాసానికి వెళ్ళిపోయారు.

- ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి విమానాల్లో వచ్చిన వారిని బెంగళూరులో క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తున్నారు.

- అయితే మంత్రి నేరుగా తన నివాసానికి వెళ్లిపోవడం పై విమర్శలు వచ్చాయి.

- తాను కేంద్రంలో ఔషధ శాఖా మంత్రి అనీ, తన శాఖ అత్యవసర సర్వీసుల పరిధిలో ఉందనీ, అందుకే తనకు క్వారంటైన్ నిబంధన వర్తించదనీ మంత్రి చెప్సపారు.

- ఆరోగ్య సేతు యాప్ లో నా వివరాలు పొందుపరిచాను.. తరచూ వైద్య పరీక్షలు చేయిన్చుకున్తున్నాను అంటూ మంత్రి సదానంద గౌడ చెప్పుకొచ్చారు. 

 


 


2020-05-26 04:12 GMT

- ప్రేమించిన యువకుడిపై కత్తితో దాడి

- నిద్రమాత్రలు మింగి యువతి ఆత్మహత్యాయత్నం

-  కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో సంఘటన.

- అపస్మారక స్థితిలో యువతి... మచిలీపట్నం ఆసుపత్రికి  తరలింపు.

- ఆర్కే కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న యువతి మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెం మాగంటి నాగలక్ష్మి

- గూడూరుకు చెందిన, పెడన తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న యువకుడు గొరిపర్తి పవన్ కుమార్ 

- ఇరువురి మధ్యా గత రెండేళ్లుగా పరిచయం.


2020-05-26 04:10 GMT

వలస కార్మికులతో వెళుతున్న బస్సు బోల్తా..

శ్రీకాకుళం జిల్లాలో వలస కార్మికులతో వెళుతున్న బస్సు బోల్తా.. 33 మందికి గాయాలు

➡️ప్రమాద సమయంలో బస్సులో 42 మంది

➡️బాధితులందరూ పశ్చిమ బెంగాల్ వారే

➡️కర్ణాటక నుంచి వస్తుండగా ఘటన

➡️గాయపడిన వారిని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు

➡️కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



2020-05-26 04:08 GMT

- సఖినేటి పల్లి వద్ద ముందుకు వచ్చిన సముద్రం

- సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో రెండు కిలోమీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చిన వైనం. 

- సముద్రపు నీట మునిగిన పంటపొలాలు

- స్థానికులలో ఆందోళన 

2020-05-26 02:48 GMT

అడ్మిషన్ల కోసం ప్రచారం చేస్తే..

- రాబోయే విద్యా సంవత్సరానికి కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఇంటింటికి వెళ్లి విద్యార్థులను చేర్పించుకునేందుకు ప్రచారం చేస్తున్నాయి.

- దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం వున్న నేపథ్యంలో అడ్మిషన్ల ప్రచారంలో ఎవరూ పాల్గొనకూడదు.

- నిబంధనలను అతిక్రమిస్తే స్కూల్ యాజమాన్యం పై కఠిన చర్య లు తీసుకోవడమే కాకుండా ముందస్తు నోటీసు జారీ చేయ కుండా స్కూల్ గుర్తింపు రద్దు చేస్తారు.

-  పశ్చిమగోదావరి జిల్లా డీఈవో రేణుక 


2020-05-26 02:26 GMT

ఉపరితల ద్రోణి - వడగాలుల జోరు

- ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా మధ్య తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి.

- దీంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.

- 27న రాయలసీమ, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడవచ్చు.

- దక్షిణ కోస్తాలో వడగాలులతో ఎండ తీవ్రత ఉంటుంది

- వాతావరణ శాఖ ప్రకటన 

2020-05-26 02:23 GMT

విశాఖలో కరోనా అలజడి

- విశాఖపట్నంలో కరోనా కల్లోలం 

- నిన్న ఒక్కరోజే 10 కేసులు నమోదు 

- ఐదు కేసులు వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి 

- ఐదు కేసులు స్థానికంగా నమోదు 

అచ్యుతాపురం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని చిట్టిబోయినపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్


 

2020-05-26 01:42 GMT

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అరుదైన దేవాంగ పిల్లి పిల్లలు

- తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అరుదైన దేవాంగ పిల్లి పిల్లలు కనిపించాయి.

= రోడ్డు నిర్మాణ కార్మికులకు అవి కనిపించాయి.

- వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

- వాటిని పరిశీలించిన అటవీశాఖ అధికారులు వాటిని అరుదైన దేవంగ పిల్లి పిల్లలుగా గుర్తించారు.

- శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన దేవాంగ పిల్లులు ఉంటాయని వారు చెప్పారు.

 





Tags:    

Similar News