Live Blog: ఈరోజు (మే-24-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-24 01:08 GMT
Live Updates - Page 2
2020-05-24 10:23 GMT

-- నెల్లూరు జిల్లా లోని కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

- ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..

- ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు

2020-05-24 10:23 GMT

ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్

ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..

కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..

రంగంలోకి పోలీసులు

2020-05-24 09:56 GMT

అది చార్రిత్రాత్మక కట్టడం అని నిరూపిస్తే రాజీనామా.. ఎమ్మెల్యే సవాల్!

విజయనగరం మూడు లాంతర్ల కట్టడం కూల్చివేతపై ఎమ్మెల్యే కోలగ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి మాట్లాడుతూ..

అది చారిత్రాత్మక క‌ట్టడ‌మ‌ని నిరూపిస్తే త‌న‌ ప‌దవికి రాజీనామా చేస్తాన‌ని, ఆర్కియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో ఈ క‌ట్టడం న‌మోదైంద‌ని నిరూపిస్తారా? అని స‌వాల్ విసిరారు.

- పూర్తి వివరాలు 

2020-05-24 09:53 GMT

ఉంఫాన్ తుపానుతొ పశ్చిమ బెంగాల్ లో 86 మంది మృతి!

ఒక పక్క కరోనా కేసులతో దేశం వణుకుతున్న వేళా మరోపక్క ఉంఫాన్ తుఫాన్ విరుచుకుపడింది.

ఈ తుఫాన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 86 మంది మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్ లో విద్యుత్, నీటి సరఫరా సమస్య తీవ్రం అయింది.                                 - పూర్తి వివరాలు 


2020-05-24 08:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 66 కేసులు

-రాష్ట్రంలో గత 24 గంటల్లో11,357 సాంపిల్స్ ని పరీక్షించగా, 66 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.

-29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

-56 మంది కరోనా బారిన పడి మరణించారు.

-ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందుతున్నవారి సంఖ్య 764గా ఉంది. 

2020-05-24 04:59 GMT

ఎమ్మెల్యే సీతక్క సేవలకు ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశంశలు

- కరోనా కష్టకాలంలో కొండకోనలు దాటి దారిడొంక లేని గూడేలకు వెళ్లి ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సేవ అద్భుతం.

- వలస కూలీలకు అండగా నిలిచిన తీరు అనిర్వచనీయం.

- వివిధ రంగాల్లో సేవలందించి చరిత్రలో నిలిచిన మహిళల గురించి విన్నాం.. చదివాం..

- సీతక్కను కళ్లారా చూస్తున్నాం.

- భావితరాలకు సీతక్క మార్గదర్శి..

- ట్విట్టర్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి

 



2020-05-24 04:33 GMT

దేశంలో పెరుగుతూనే ఉన్న కరోనా కేసులు

దేశంలో 24 గంటల్లో 6,767 మందికి కొత్తగా కరోనా

➡️24 గంటల్లో 147 మంది మృతి

➡️కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,867

➡️కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,31,868

➡️73,560 మందికి ఆసుపత్రుల్లో చికిత్స

2020-05-24 04:22 GMT

- వికారాబాద్ జిల్లా.... కొడంగల్ లో మున్సిపల్ సిబ్బంది పనులకు హాజరు కాకుండా ధర్నా చేపట్టిన కార్మికులు.

- తమ విధులు నిర్వహిస్తుండగా ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపణ.

- ప్రజల కోసం పని చేస్తున్న మమ్మల్ని చిన్న చూపుతో మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్య.

2020-05-24 03:33 GMT

టీటీడీ జేఈవో ఇంటిలో బంగారం చోరీ!

- ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ రవీంద్రనాద్ తెలిపిన వివరాల ప్రకారం 

- దాదాపు 6.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ 

- టీటీడీ తిరుపతి జేఈవో బసంత్ కుమార్ బంగ్లాలో ఘటన 

- శనివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో మారు తాళాలతో బీరువా తెరిచి సొత్తు కొల్లగొట్టిన దుండగులు 

- 18 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు పోయినట్టు బసంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసుల దర్యాప్తు 


2020-05-24 03:05 GMT

రేపు వాతావరణం చల్లబడే చాన్స్!

- నాలుగురోజులుగా ఎండ వేడిమితో అల్లాడిపోతున్న హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. 

- మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ చెబుతోంది.

- దీంతో రేపు ఎల్లుండి అంటే 25, 26 తేదీల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- ఇకపోతే ప్రస్తుతం మాత్రం భానుడు బాగ్గుమంటూనే ఉన్నాడు.

- ఎండా వేడిమి, ఉక్కపోత, వేడిగాలులు ముప్పేట దాడితో నగర జీవులు నరకయాతన పడుతున్నారు.

- శనివారం  గరిష్ఠంగా 42.8, కనిష్ఠంగా 26.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. 

Tags:    

Similar News