Live Blog: ఈరోజు (మే-24-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-05-24 01:08 GMT

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. బయటకు వెళ్ళినపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

ఈరోజు తాజా సమాచారం 



Live Updates
2020-05-24 16:46 GMT

- విశాఖ నుండి రేపు ప్రారంభం కావాల్సిన విమానాల రాకపోకలు తాత్కాలికంగా రద్దు

- రేపు ఉదయం నుండి నాలుగు ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు డొమిస్టిక్ ఫ్లైట్ ల షెడ్యూల్ ఇవాళ ప్రకటించిన అధికారులు

- ఆఖరి నిముషంలో సాంకేతిక కారణాలతో విమానాల రాకపోకలు రద్దు

- రేపు ఉదయం చంద్రబాబు రావాల్సిన ఫ్లైట్ కూడా రద్దయినట్టేనని తెలుస్తోంది

- దీంతో రేపటి చంద్రబాబు విశాఖ టూర్ పై మళ్ళీ సందిగ్ధం

2020-05-24 16:30 GMT

- నెల్లూరు జిల్లా భూదానం  బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం..

- గూడూరు వైపు వెళ్తున్న బైక్ , రోడ్డు క్రాస్ చేస్తున్న లారీ క్లీనర్ ను ఢీ కొట్టడంతో ఈ సంఘటన జరిగింది.

- ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర రక్త గాయాలు ఐయాయి.

- టోల్ ప్లాజా అంబులెన్సు లో గూడూరు హస్పిటల్ కు తరలించారు ..

2020-05-24 16:11 GMT

- దుబాయ్ నుండి వచ్చి నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారన్ టెన్ లో ఉన్న 144 మందిలో 56 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు

- అప్రమత్తమైన అధికారులు 

- ప్రత్యేక వాహనాలలో వారిని విజయవాడ తరలిస్తున్నట్లు తెలిపిన మండల తాసిల్దార్ ఎం సురేష్ కుమార్ 

2020-05-24 15:29 GMT

- రేపు చంద్రబాబు విశాఖ పర్యటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతి.

- ఈమేరకు ఏపీ డిజిపి నుంచి సానుకూల స్పందన. చంద్రబాబు విశాఖ పర్యటనకు ఎట్టకేలకు ఏపీ డిజిపి అనుమతి.

- ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు చంద్రబాబు.

- వెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు.

- స్థానిక టీడీపీ నాయకులతో భేటీ. ఎల్జీ పొలిమెర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ప్రాంతాల్లో పర్యటన.

- సాయంత్రం రోడ్డుమార్గంలో అమరావతి నివాసానికి చంద్రబాబు

-పూర్తి వివరాలు 


2020-05-24 15:28 GMT

- తెలంగాణలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా తగ్గడం లేదు..

- తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- తాజాగా నమోదైన కొత్త కేసుల్లో GHMC పరిధిలో 23, రంగారెడ్డిలో 1, వలస కార్మికులకు 11, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా సోకినట్లుగా వెల్లడించింది

- పూర్తి వివరాలు 

2020-05-24 14:50 GMT

- ఆంధ్ర-తెలంగాణా సరిహద్దుల్లోని జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు

- మద్యం బాటిల్స్ తో పట్టుబడ్డ కానిస్టేబుల్

- తెలంగాణా రాష్ట్రం నుండి ఆంధ్రకు అక్రమంగా 13 మద్యం బాటిల్స్ తో ద్వీచక్ర వాహనం పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న నందిగామ పోలీసులు

- ఈ తనిఖీలలో పట్టుపడ్డ వారిలో AR కానిస్టేబుల్ గా ప్రస్తుతం విజయవాడ నందు GRP లో డిప్యూటేషన్ లో పనిచేస్తున్న యార్లగడ్డ శివరామకృష్ణ

- అతని స్నేహితుడు కుర్రా నాగరాజులుగా గుర్తించిన పోలీసులు

- ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసిన నందిగామ పోలీసులు

2020-05-24 14:13 GMT

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నాలుగో దశలో భాగంగా నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశీయంగా ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నారు. నిబంధనల అనుగుణంగా విమాన, రైలు, బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.

-పూర్తి కథనం 

2020-05-24 14:10 GMT

గత వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. ఉదయం 7.30, 8 గంటల సమయం అయిందంటే చాలు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువై పోయింది. దీంతో రాష్ట్ర ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు.

-పూర్తి కథనం 

2020-05-24 10:29 GMT

- సత్తెనపల్లి సబ్ డివిజన్ పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గుత్తికొండ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద పేకాట స్థావరం పై పోలీసుల దాడి.

- జూదం ఆడుతున్న పదిహేను మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్ప పోలీసులు.

- పిడుగురాళ్ల సిఐ కు అందిన సమాచారం మేరకు దాడులు.

- వారి వద్ద నుండి ₹ 1,57,550 స్వాధీనం 

- 17 మోటర్ సైకిళ్ళు, 13 సెల్ ఫోన్ లు సీజ్. 


2020-05-24 10:24 GMT

- కృష్ణా జిల్లాలో సారా బట్టీలపై ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో దాడులు

- రామవరపుమోడీ అర్తమూరు మణిమేశ్వరం గ్రామాలలో ఏకకాలంలో సారా బట్టీలుపై దాడులు

- దాడుల్లో 50 లీటర్ల కాపుసారా 40 కిలోల నల్లబెల్లంతో పాటు 3,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 5 గురిపై కేసు నమోదు.

- ఇద్దరూ డీఎస్పీలు ఐదుగురు సీఐలు 10 మంది ఎస్సైలు 250 మంది సిబ్బంది తో దాడిలో పాల్గొన్నారు.

Tags:    

Similar News