ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
నిన్నటి ముఖ్యాంశాలు కొన్ని..
- రంగనాయకమ్మ సరైన కారణాలు చెప్పలేకపోయారు : సీఐడీ - మరిన్ని వివరాలు
- తెలంగాణలో మరో 38 మందికి కరోన పాజిటివ్ - మరిన్ని వివరాలు
- ఏపీలో షాపులు ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్... కండిషన్లు ఇవే! - మరిన్ని వివరాలు
ఈరోజు తాజా సమాచారం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రవాసాంధ్రుల ప్రత్యేక విమానం. కువైట్ నుంచి 154 మంది గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రవాసాంధ్రులు. అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ లో స్క్రీనింగ్ టెస్టులు చేయనున్న వైద్య బృందం.
స్క్రీనింగ్ టెస్టులు అనంతరం గూడవల్లి నారాయణ కళాశాల జిల్లా క్వారంటైన్ కి అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో వారి వారి జిల్లాల క్వారంటైన్ సెంటర్ లకు తరలించనున్న అధికారులు.
*ఈరోజు రాత్రి 55 మంది ప్రయాణికులతో రియాద్ నుంచి మరో ప్రత్యేక విమానం గన్నవరం విమానాశ్రయానికి రానున్నట్లు అధికారులు తెలిపారు.*
- జూన్ మొదటివారం నుంచి తెలంగాణాలో షూటింగ్ లకు ప్రభుత్వ అనుమతి.
- ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసిన సినిమా రంగ ప్రముఖులు
- ప్రభుత్వం.. కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా సినిమా చిత్రీకరణలు జరపాలని సినీ పరిశ్రమ పెద్దలకు సూచించిన సీఎం
- చిత్రీకరణల అనుమతి, థియేటర్ల పునఃప్రారంభంపై విధి విధానాలను ప్రభుత్వం ప్రకటిస్తుందని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పిన కేసీఆర్
- సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి - పూర్తి కథనం
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు🙏🙏 ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియా కి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2020
తెలుగులో తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం.. డౌన్ లోడ్ చేసుకోండి HMTV News యాప్ ఇప్పుడే..ఇక్కడినుంచే!
సస్పెన్షన్ కు గురైన IPS అధికారి A. B వెంకటేశ్వరరావు ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హై కోర్ట్ ఆదేశం.
క్యాట్ ఆర్డరును పక్కన పెట్టిన హై కోర్ట్.
సస్పెన్షన్ కాలంలో జీతభత్యాలన్నీ ఇవ్వాలన్న హై కోర్ట్.
నిర్మల్ జిల్లా :
తానుర్ మండలం కోలూరు గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా చుక్క నీరు రావటం లేదని కేటీఆర్ కి ట్విట్ చేసిన ఓ యువకుడు..
స్పందించిన ఐటి మంత్రి కేటీఆర్
గ్రామానికి కదిలిన జిల్లా యంత్రాంగం....
2 రోజుల్లో సమస్య పరిష్కారం దిశగా పనులు షురూ...
ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 623ను సస్పెండ్ చేసిన హైకోర్ట్..
జీవో నంబర్ 623 ప్రకారం పంచాయితీ కార్యాలయాలకి రంగులు వేయాలనుకున్న ఏపీ సర్కారు .
భవనాలపై వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయనే వాదనలకు ఏకీభవించిన ధర్మాసనం
ఈ జీవో ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని సీఎస్, పంచాయతీరాజ్‌శాఖ, ఈసీని హైకోర్టు ఆదేశించింది.
మే నెల కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు పూర్తి వేతనాల చెల్లింపునకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు విడుదల
మే నెలకు చెందిన జీతాన్నీ వందశాతం జూన్ 1 తేదీన చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ఆర్ధిక శాఖ
వేతనాల చెల్లింపుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ట్రెజరీ, సీ ఎఫ్ ఎం ఎస్ కు ఆదేశాలు
డాక్టర్ సుదాకర్ కేసు సీబీఐ కి అప్పగించిన హై కోర్టు...
8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐ కి హై కోర్టు ఆదేశం..
విశాఖ పోలీసుల పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని హై కోర్టు ఆదేశం.
కడప జిల్లా
రైల్వే కోడూరు
వినూత్న నిరసన చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంత గాని నరసింహ ప్రసాద్
పెరిగిన కరెంట్ బిల్లులకు నిరసనగా విసనకర్రలు, ల్యాంతరులు ను సైకిల్ పై విక్రయిస్తూ నిరసన వ్యక్తం చేసిన పంతగాని
విశాఖ జిల్లా, అనంతగిరి మండలం చిలకలగెడ్డ లో పాము కాటుకు వ్యక్తి మృతి.
యశోద అనే గిరిజనుడు సమీపంలో కొండకు వెళ్ళి వస్తుండగా ఘటన జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా
బిక్కవోలు లో కరోనా విజృంభణ
ముగ్గురికి కోవిడ్-19 పాజిటివ్
రెడ్ జోన్ లో బిక్కవోలు
హడలిపోతున్న పెదపూడి, బిక్కవోలు మండలాలు