Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-25 00:52 GMT
Live Updates - Page 4
2020-06-25 03:23 GMT

- నేడు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం

2020-06-25 03:23 GMT

తెలంగాణలో ఈరోజు..

- తెలంగాణలో నేడు ఆరో విడత హరిత హారం కార్యక్రమం

- మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్‌ 

- తెలంగాణ వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు

2020-06-25 03:22 GMT

స్పోర్ట్స్‌ ఈరోజు..

- నేడు ఐసీసీ సమావేశం

- టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాపై నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ 

- వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐసీసీ బోర్డు సమావేశం

2020-06-25 03:21 GMT

ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు

- నేడు అచ్చెన్నాయుడుని కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ అధికారులు

- గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అచ్చెనాయుడిని విచారించనున్న అధికారులు

2020-06-25 03:21 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ఈరోజు..

- అమరావతి : నేడు విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమావేశం.

- డిగ్రీ, పీజి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్‌.

2020-06-25 03:06 GMT

ఐటీ రిటర్నుల గడువు జులై 31 వరకు పెంపు

కరోనా నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (ఐటీ)రిటర్నుల సమర్పణ గడువును జులై 31 వరకు పెంచుతూ బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీటీడీ) ఉత్తర్వులు జారీ చేసింది.

* 2019-20కు చెందిన రిటర్నుల సమర్పణ గడువును నవంబరు 30 వరకు పెంచుతూ గతంలోనే ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.

* 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల మినహాయింపు కోసం చేసే పెట్టుబడుల గడువును కూడా జులై 31 వరకు పెంచింది.

* ఆధార్‌- పాన్‌ అనుసంధానం గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది.




2020-06-25 02:57 GMT

మన్యంలో వింత వ్యాధితో మరణిస్తున్న పాడి పశువులు

 గూడెంకొత్తవీధి: మన్యంలో పాడి పశువులకు వింత వ్యాధి పట్టి పీడిస్తోంది.

- సరైన వైద్యం లేక వీటి ప్రాణాలు మృత్యువాత పడుతున్నాయి.

- ప్రధానంగా పశువుల శరీరంపై మచ్చలు వ్యాపించి.. నోరు, ముక్కు నుంచి నురగ వచ్చి కొద్ది సేపటికే మృతి చెందుతున్నాయంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- ఈ వ్యాధి మొదటగా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీలోని నిమ్మ చెట్టు అనే గ్రామం నుంచి వ్యాపించినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.

- వీటిని తక్షణమే పశు వైద్యులు పరిశీలించి తగిన వైద్యాన్ని అందించాలంటూ గిరిపుత్రులు కోరుతున్నారు.




2020-06-25 02:21 GMT

యథావిధిగా ఆర్టీసీ సర్వీసులు

- రాజమహేంద్రవరం: జిల్లాలోని ఆయా డిపోల నుంచి బస్సు సర్వీసులు యథావిధిగానే నడుస్తాయి.

- జిల్లా అంతటా గురువారం నుంచి లౌక్‌డౌన్‌ అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ నిర్ణయించినప్పటికీ తర్వాత దానిని కంటైన్మెంట్, బఫర్‌ జోన్‌లకు మాత్రమే పరిమితం చేయడంతో జిల్లాలో ప్రస్తుతం తిరిగే రూట్లలో ఆర్టీసీ సర్వీసులను యథావిధిగానే తిప్పేందుకు అధికారులు నిర్ణయించారు.

- జిల్లాలో తొమ్మిది డిపోల నుంచి మొత్తం 286 సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం ఆర్‌వీఎస్‌.నాగేశ్వరరావు తెలిపారు.

- అమలాపురం డిపో నుంచి 45 సర్వీసులు, రాజమహేంద్రవరం నుంచి 58, కాకినాడ నుంచి 62, గోకవరం నుంచి 22, రావులపాలెం నుంచి 20, రాజోలు నుంచి 14, ఏలేశ్వరం నుంచి 20, రామచంద్రపురం నుంచి 15, తుని నుంచి 30 సర్వీసులు చొప్పున నడపనున్నారు.  




2020-06-25 02:15 GMT

- ఇవాళ్టితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది.

- ఇప్పటి వరకూ నామినేషన్లు దాఖలు కాలేదు.

- వైసీపీ తరఫున డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేరు ఖరారైంది.

- ఇవాళ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

మాణిక్య వర ప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ చేసేందుకు వైకాపా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది అని తెలిసింది.

2020-06-25 02:05 GMT

తిరుపతిలో భారీ చోరీ!

తిరుపతి.. గాయత్రినగర్‌లో భారీ చోరీ జరిగింది.

- తలుపులు తొలగించి ఇంట్లోకి చొరబడిన ముఠా రూ.10.70 లక్షల విలువైన బంగారం, రూ.3.75 లక్షల విలువైన నగదును దోచుకుంది.

- చోరీ జరిగినట్టు సాయంత్రం వరకు యజమాని గుర్తించకపోవడం గమనార్హం.

- ఆ తర్వాత తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News