మన్యంలో వింత వ్యాధితో మరణిస్తున్న పాడి పశువులు

 గూడెంకొత్తవీధి: మన్యంలో పాడి పశువులకు వింత వ్యాధి పట్టి పీడిస్తోంది.

- సరైన వైద్యం లేక వీటి ప్రాణాలు మృత్యువాత పడుతున్నాయి.

- ప్రధానంగా పశువుల శరీరంపై మచ్చలు వ్యాపించి.. నోరు, ముక్కు నుంచి నురగ వచ్చి కొద్ది సేపటికే మృతి చెందుతున్నాయంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- ఈ వ్యాధి మొదటగా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీలోని నిమ్మ చెట్టు అనే గ్రామం నుంచి వ్యాపించినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.

- వీటిని తక్షణమే పశు వైద్యులు పరిశీలించి తగిన వైద్యాన్ని అందించాలంటూ గిరిపుత్రులు కోరుతున్నారు.




Update: 2020-06-25 02:57 GMT

Linked news