Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-24 01:04 GMT
Live Updates - Page 3
2020-06-24 03:03 GMT

విజయవాడలో పూర్తి లాక్ డౌన్ : జిల్లా కలెక్టర్

- స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జూన్ 26వ తారీఖు అనగా శుక్రవారం నుండి విజయవాడ నగరాన్ని ఒక వారం రోజుల పాటు పూర్తిగా లాక్ డౌన్ చేయడం జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

- విజయవాడ నగరంలోని ప్రజలు తమకు కావాల్సిన నిత్యవసర వస్తువులు, కాయగూరలు ఏవైనా ఈ రెండు రోజుల్లో సమకూర్చుకోవాలని 26వ తారీకు నుండి పూర్తిగా కఠిన ఆంక్షలతో విజయవాడ నగరం లాక్ డౌన్ చేయబడును అని ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

- మెడికల్ షాపులు తప్ప ఎటువంటి వ్యాపార సముదాయాలు ఈ వారం రోజులపాటు ఉండవని కలెక్టర్ తెలిపారు.

- కృష్ణా జిల్లా రూరల్ ప్రాంతాలలో కూడా కరోనా పాజిటివ్ కేసులు వల్ల అక్కడ కూడా కొన్ని ఆంక్షలు స్థానిక ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ నిర్ణయం తీసుకుని ఆంక్షలు అమలు చేస్తారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. 




2020-06-24 02:18 GMT

1800 లీటర్ల సారా ఊట ధ్వంసం: 500 లీటర్ల సారా స్వాధీనం

- పుంగనూరు మండలంలోని పట్రపల్లె అటవీప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్‌ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు తనికీ  చేశారు.

- ఈ దాడుల్లో 1800 లీటర్ల సారా తయారీ ఊటను ధ్వంసం చేశారు.

- అలాగే 500 లీటర్ల సారాతో పాటు బెల్లం, చెక్క, డ్రమ్ములను స్వాధీనం చేసుకుని బట్టీలను ధ్వంసం చేశారు.

- సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సారా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- ఈ దాడుల్లో ఎస్‌ఐ సరితారెడ్డి, పోలీసులు పాల్గొన్నారు. 




2020-06-24 02:14 GMT

నేటి నుంచి హిందూపురం నుంచి తిరుపతి, విజయవాడకు బస్సులు

- హిందూపురం నుంచి తిరుపతి, విజయవాడలకు ఈరోజు నుంచి సూపర్‌ లగ్జరీ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు డీఎం శంకర్‌ తెలిపారు.

- మధ్యాహ్నం 1 గంటకు బస్సు బయలుదేరి కదిరి, మదనపల్లి మీదుగా తిరుపతి చేరుకుంటుందన్నారు.

- తిరుపతి నుంచి రాత్రి 10.30 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు.

- విజయవాడకు రాత్రి 7 గంటలకు బయల్దేరి అనంతపురం, తాడిపత్రి, నంద్యాల, మార్కాపురం, గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంటుంది.

- విజయవాడలో రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం హిందూపురం చేరుకొంటుందన్నారు. 




2020-06-24 01:29 GMT

అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టా ఇవ్వాలి

- అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి ఇళ్ల పట్టా ఇవ్వాలని, ఇళ్ల పట్టాల పంపిణీ నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

- మంగళవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్లతో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇసుక, ఉపాధి హామీ పథకం పనులు, నవరత్నాలు అమలు, కోవిడ్-19, ఇరిగేషన్ ప్రాజెక్టులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 




2020-06-24 01:22 GMT

ఏపీలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు రద్దు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. డిగ్రీ మొదటి, రెండో ఏడాది విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులకు సంబంధించి స్థానిక విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News