1800 లీటర్ల సారా ఊట ధ్వంసం: 500 లీటర్ల సారా స్వాధీనం
- పుంగనూరు మండలంలోని పట్రపల్లె అటవీప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు తనికీ చేశారు.
- ఈ దాడుల్లో 1800 లీటర్ల సారా తయారీ ఊటను ధ్వంసం చేశారు.
- అలాగే 500 లీటర్ల సారాతో పాటు బెల్లం, చెక్క, డ్రమ్ములను స్వాధీనం చేసుకుని బట్టీలను ధ్వంసం చేశారు.
- సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సారా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- ఈ దాడుల్లో ఎస్ఐ సరితారెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.
Update: 2020-06-24 02:18 GMT