చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని బురుగులపల్లి, కోడిగానీపల్లి, చిన్నగొల్లపల్లి, పెద్దగొల్లపల్లి గ్రామాల సమీపంలో ఈరోజు వేకువజామున 4 గంటల ప్రాంతంలో పంటపొలాలపై ఏనుగుల సంచారం, టమోటా, చామంతి పంటలతో పాటు డ్రిప్ పైపులు ధ్వంసం, భారీగా నష్టపోయిన రైతులు.
* విశాఖ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.
* మైదాన ప్రాంతంనకు అక్రమంగా తరలిస్తున్న రూ. 20 లక్షల విలువైన 970కిలోల గంజాయి పట్టివేత.
* ఇద్దరు అరెస్టు, రెండు సెల్ ఫోన్లు, గంజాయి తరలిస్తున్న లారీ స్వాధీనం.
నేడే తెలంగాణా ఇంటర్ ఫలితాలు..
- ఈ రోజు తెలంగాణా ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాటు చేసింది.
- ఫలితాలు నేరుగా ఇంటివద్ద ఉండి చూసుకునేందుకు ప్రత్యేక వెబ్ సైట్ డౌన్ లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
- ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
- ఇక విద్యార్ధులు తమ ఫలితాలను tsbie.cgg.gov.in, manabadi.co.in, schools9.com వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి విద్యార్ధులు చెక్ చేసుకోవచ్చు.
- వీటితో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లో TSBIE m-Services అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చు.
- మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు.
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు అధికారులు.
భారీ టేకు చేప!
- కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నానికి చెందిన మత్స్యకారులకు సముద్రంలో దొరకిన భారీ టేకు చేప
- 1,150 కిలోల బరువున్న టేకు చేప
- పడవ నుంచి క్రేన్ సాయంతో వెలికి తీత
- రూ.37 వేలు పలికినట్లు చెప్పిన మత్స్యకారులు.
- ఇలాంటి టేకు చేపలు అరుదుగా దొరుకుతాయని చెప్పిన మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రమణ.
కాసేపట్లో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు
- ఈరోజు ఉదయం 8 గంటలకు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు
- సూర్యాపేటకు చేరిన సంతోష్ బాబు పార్థివ దేహం
- కేసారంలో సైనిక లాంచనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు
- దేశవ్యాప్తంగా సంతోష్ బాబు కు నివాళులు అర్పిస్తున్న ప్రజలు
- రెండు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.
- సమావేశాల్లో 15 బిల్లులకు ఆమోదం లభించింది.
- రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు.
- బడ్జెట్ పై పెద్దగా చర్చ జరగలేదు