Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు గురువారం, 18 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ద్వాదశి ( ఉ.09:38 వరకు), భరణి నక్షత్రం (ఉ.08:30 వరకు) సూర్యోదయం 5:42 am,సూర్యాస్తమయం 6:52 pm
ఈరోజు తాజా వార్తలు
» తెలంగాణ లో రికార్డ్ స్థాయిలో 352 కరోన పాజిటివ్ కేసులు నమోదు..
- ఒక్క జిహెచ్ఎంసి లోనే 302 కేసులు...
- ఇప్పటి వరకు 6027 కి చేరిన కేసుల సంఖ్య ..
- ఇవాళ మరో ముగుతూ మృతి 195 కి చేరిన మరణాల సంఖ్య...
- 2531 అక్టీవ్ కేసులు...
- ఇవాళ 230 మంది డిచార్జ్ ఇప్పటి వరకు 3301 డిచార్జి అయ్యారు...
» తెలంగాణలో కొత్తగా 352 కేసులు..
- తెలంగాణలో ఈ రోజు 352 కొత్తగా కేసులు నమోదు.
- కరోనాతో పోరాడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 3301 మంది కోలుకున్నారు.
- ప్రస్తుతం రాష్ట్రంలో 2531 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
- ఇప్పటి వరకు కరోనాతో 195 మంది ప్రాణాలు కోల్పోయారు.
- చల్లపల్లి మండలం మంగలాపురంలో విషాదం..
- మంగళాపురం బీసీ కాలనీలో వివాహిత డేగల దేవీ రాజేశ్వరి(22) ఉదయం అనుమానాస్పద మృతి.
- కొద్ది గంటల తర్వాత భర్త డేగల పిచ్చియ్య (30) గుళికలు తిని ఆత్మహత్య.
- ఐదేళ్ల క్రితం వివాహం..ఇద్దరు మగపిల్లలు. భార్యా భర్తల మధ్య ఘర్షణలే మృతికి కారణం. పోలీసుల దర్యాప్తు.
♦♦అమరావతి♦♦
» చెరుకువాడ శ్రీ రంగనాద రాజు, మంత్రి.
- శాసనమండలిలో బిల్లుల పట్ల టీడీపీ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు.
- బిల్లులు టెకప్ చేయమంటే రూల్స్ కు విరుద్ధంగా టీడీపీ సభ్యులు వ్యవహరించారు.
- రూల్ 90 నోటీసును 24గంటల ముందు ఇవ్వాలని చెప్పిన అందుకు విరుద్ధంగా టీడీపీ వ్యవహరించింది.
- మండలిలో ఒక మంత్రిపై దాడి చేయటం హేయమైన చర్య.
- పోడియం వద్దకు మేం వెళ్ళలేదు.
- వెళ్లిన వారిని కూడా నేను వారించి వెనక్కి తీసుకొచ్చాను.
- డిప్యూటీ చైర్మన్ నిబంధనలను పాటించలేదు.
- గుంటూరు జిల్లాలో 3 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేశాం.
- 4 వేల ఎకరాలు భూ సేకరణ చేశాం.
- గుంటూరు జిల్లాలో పేదలకు అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం.
- ఉపాధి హామీ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నాం.
-♦ బిఆర్కే భవన్
- రైతు బందు పథకంపై సియస్ సోమోష్ కుమార్ సమీక్ష
- ముఖ్యమంత్రి కేసిఆర్ అదేశాల మేరకు రైతు బంధు పథకం ఎక్కడ అలస్యం కాకుండా నగదు బదీలి చేయ్యలని అధికారులకు సియస్ అదేశం
- రైతులకు ఎటువంటి ఇబ్బందుకు కల్గకుండా రైతు బంధు పథకం నిర్వహించాన్నా సియస్ సోమోస్
» 19995 బ్యాచ్ ఐపీఎస్ లకు పదోన్నతులు
- రాష్ట్రంలో నలుగురు ఐజీ స్థానం లో ఉన్న ఐపీఎస్ లకు అడిషనల్ డీజీ లాగ పదోన్నతి
- మహేష్ భగవత్, స్వాతి లక్రా, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, వీ వీ శ్రీనివాస్ రావు కి అడిషనల్ డీజీపీ లాగా పదోన్నతి
♦♦ అమరావతి ♦♦
- కన్నబాబు, మంత్రి.
- బిల్లులను అడ్డుకుంటామని ముందు నుంచి చెప్పినట్టుగానే టీడీపీ అడ్డుకుంది.
- ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకుంది.
- అప్రాప్రియేషన్ బిల్లును అడ్డుకున్న చరిత్రను మూటగట్టుకుంది టీడీపీ.
- శాసన మండలిలో ఫొటోలు తీయొద్దని శాసన మండలి డెప్యూటీ ఛైర్మన్ చెప్పినా లోకేష్ వినలేదు.
- మంత్రి వెలంపల్లిని టీడీపీ ఎమ్మెల్సీలు కొట్టారు.. కాలితో తన్నారు.
- బిల్లులను అడ్డుకున్న టీడీపీ జీతాలు ఇవ్వకుండా చేయగలిగింది.
- అమరావతి ప్రేమికుల కోసమే టీడీపీ పని చేస్తుందే తప్ప.. ప్రజల కోసం కాదు.
- ఛైరులో ఉన్న రెడ్డి సుబ్రమణ్యం మా వాళ్లు అంటూ టీడీపీని ఓన్ చేసుకుంటే.. మేమేం చెప్పగలం..?
- మంత్రులను బయటకు పంపమని ఓ సభ్యుడు చెబుతారు.
- అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే అన్నా హజారేని అరెస్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తారు.
- దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంను 3 వేల మంది పోలీసులు లాక్కెళ్లిన విషయం గుర్తుకు రాదా..?
- మండలిలో జరిగిన ఘటనలపై చంద్రబాబు కనీసం బాధ కూడా వ్యక్తం చేయలేదు.
- లోకేష్ తీసిన వీడియోలు.. ఫొటోలు బయట పెట్టాలి.
- లోకేెష్ ఫొటోలు తీయడంలో దిట్ట కదా..? అవి బయట పెట్టండి.
- మొగుణ్ణి కొట్టి మొగశాలకు ఎక్కిందన్నట్టుగా ఉంది టీడీపీ తీరు.
»» అసెంబ్లీ
- స్పీకర్ తమ్మినేని సీతారాం చిట్ చాట్
- అసెంబ్లీ వీడియో లను మర్ఫింగ్ చెయ్యడం తీవ్రమైన అంశం
- మొన్న నేను వేసిన డ్రెస్ కూడా వేరు
- నా వ్యాఖ్యల పై మర్ఫింగ్ వీడియో లను ప్రచారం చేస్తున్నారు
- సభలో అందరూ ఉన్నప్పుడు జరిగిన పరిణామాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు
- దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మా వాళ్ళు నా దృష్టికి తెచ్చారు
- చట్టపరమైన చర్యలు అంశం పరిశీలిస్తున్న
- మీడియా అయినా, సోషల్ మీడియా అయినా సరే మార్ఫింగ్ చెయ్యడం చాలా తప్పు
♦♦ అమరావతి ♦♦
- రేపు జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
- వైసీపీ నుంచి 4గురు, టీడీపీ నుంచి ఒకరు బరిలో
- వైసీపీ విజయంకి అవసరం అయ్యిన అభ్యర్థులు వున్నారు
- ముగ్గురు అభ్యర్థులకు 38మంది mla ల కేటాయింపు, ఒకరికి 37మంది mla లు కేటాయించిన వైసీపీ
- రేపు ఉదయం 9గంటల నుంచి 4గంటల వరకు ఎన్నికలు, 5గంటలకు కౌంటింగ్
- పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతి
- కరోనా నిబంధనలు ప్రకారం మాస్క్ కచ్చితంగా ఉండాలి
» ప్రమాదానికి గురైన కార్మికుడు మృతి..!
- చిత్తూరు జిల్లా శ్రీసిటి పారిశ్రామిక వాడలో నిర్మాణంలో ఉన్న ఇండస్ స్ఫేస్ ఫ్యాబ్రికేసన్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పై నుండి క్రింద పడి బనోజిట్(24) అనే వలస కార్మికుడు మృతి చెందినట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు.
- అస్సాం నుండి ఇక్కడ కు వచ్చి ముస్తాఫా ఎరక్టర్ కాంట్రాక్ట్ క్రింద పరిశ్రమలో పనిచేస్తున్నట్లు సమాచారం.