» Hmtv తో రఘు రామ కృష్ణమరాజు
- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో నాకు విభేదాల్లేవ్
- జగన్ మోహన్ రెడ్డి చరిష్మా తో పాటు రఘురామ కృష్ణమ రాజు బొమ్మ కూడా నరసాపురం ఎన్నికలలో పనిచేసింది
- తెలుగుదేశం కంచుకోట అయిన నరసాపురం లో జగన్ హవా 90 శాతం ఉంటే 10 శాతం నా అభ్యర్థిత్వానిది కూడా క్రెడిట్ ఉంది
- ఇసుక వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది
- ఇళ్ల స్థలాల కొనుగోళ్లు లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి
- జగన్ మోహన్ రెడ్డి సమయం ఇస్తే చెప్పాల్సినవి చెప్పి వస్తాను
- నేనేమీ డ్యూయెట్ కోసం జగన్ మోహన్ రెడ్డి ని కలుస్తానని అనడం లేదు
- ప్రజాసమస్యల పైనే కలవాలనుకుంటున్నాను
- ఎమ్మెల్యే, ఎంపీలకే అందుబాటులో లేకుంటే ఎలా?
- రాజీనామా చేసి వాళ్ళు జగన్ ఫోటో తో పోటీ చేస్తే రఘురాముడి ఫొటో తో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను
» తూర్పుగోదావరి.. అన్నవరం.
- జూన్ 21 వ తేదీ సూర్యగ్రహణం సందర్భంగా సత్యదేవుని ఆలయం మూసివేత...
- గ్రహణం అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాల జరిపిన తరువాత ఆదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆలయం తెరువబడును..
- ఈ సందర్భంగా స్వామి వారి నిత్యఆర్జిత సేవలు, వ్రతాలు, నిత్యకళ్యాణం రద్దు..
- ఆలయం తెరిచిన తరువాత 5 గంటల నుంచి తిరిగి వ్రతాలు, నిత్యకళ్యాణం నిర్వహణ..
»ప్రధాని విడియో కాన్ఫరెన్స్ తో సిఎం కేసీఆర్
- కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది.
- కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదు అవుతున్నది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది.
- తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి.
- ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా పనిచేస్తున్నాం.
- కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం నాకున్నది.
- మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నది.
- వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెల్లడానికి సిద్ధమవుతున్నారు. వారికి అవకాశం కల్పించాలి.
- దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికి పోయైనా పనిచేసుకునే అవకాశం ఉండాలి.
- బీహార్ నుంచి హామాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారు
- బీహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి సరదాగా విడియో కాన్ఫరేన్స్ తో సంభాషణ
- సిఎం కేసీఆర్
- నితీష్ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం.
- మా సిఎస్ కూడా మీ బీహార్ వారే.
- దయచేసి పంపించండన్నా సిఎం కేసీఆర్.
»» తెలంగాణ లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదల కు టైం ఖరారు
- రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
♦♦అసెంబ్లీ♦♦
»ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండలి చీఫ్ విప్..
- పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై సీఎం నివేదిక తెప్పించుకున్నారు..
- ఒకరిపై మరొకరు నేతలు చేసుకుంటున్న విమర్శలపై పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది..
- ఇటు వంటి వాటిని సీఎం జగన్ సహించరు..
- ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళాలి..
- క్రమశిక్షణ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు..
- గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి..
- ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలి..
- హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెంకడమని సీఎం చెప్పారు..
- నాయకులు ఒకరిపై మరొకరు చెలెంజ్ లు మానుకోవాలి..
- నరసాపురంలో సంఘటనపై సీఎం జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు..
- ఎవరిది తప్పు అనేదానిపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటున్నారు..
- పార్టీ అనుమతి లేనిదే ఎవరు మీడియా సమావేశాలు నిర్వహించరాదు..
- నేతలకు ఇబ్బంది ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలి..
- ఎమ్మెల్యేలు ఎంపీలకే కాదు అందరికి ఇదే సూత్రం వర్తిస్తుంది..
- సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదనేది అవాస్తవం..
-»» ప్రసాద్ రాజు నరసాపురం ఎమ్మెల్యే
- ఎమ్మెల్యేలను పందులు గుంపుగా ఎంపీ రఘురామ్ కృష్ణ రాజు పోల్చడం సరికాదు..
- ఇబ్బంది ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని చూచించము..
- పరుష పదజాలంతో పార్టీకి నష్టం జరిగేలా ప్రవర్తించారు..
- ఆయన వ్యవహారాన్ని అందరూ చూసారు..
- మేము అందరం జగన్మోహన్ రెడ్డి బొమ్మపెట్టుకొని గెలిసాము..
- మీకు ధైర్యం ఉంటే ఆయనే రాజీనామా చేసి గెలవాలి..
- పార్టీ లేకపోతే రఘురామ కృష్ణమారాజు గడ్డి పరకతో సమానం..
షేక్ పెట్ ఎమ్మార్వో సుజాత కు బెయిల్ మంజూరు
- ఆదాయానికి మించిన కేసులో సుజాత అరెస్ట్.
- కేసులో సుజాత భర్తను విచారణ చేసిన ఏసీబీ అధికారులు.
- తనను సైతం అరెస్ట్ చేస్తారేమో అణా అనుమానంతో భర్త విజయ్ ఆత్మహత్య.
- భర్త అజయ్ అంతక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి.
మరికాసేపట్లో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి చేరుకోనున్న కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం..
- హకీమ్ పేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి చేరుకున్న మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, సీపీ సజ్జనార్...
ప.గో. పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ లో వైస్సార్సీపీ పార్టీ శ్రేణులు ఎంపీ రఘురామ కృష్ణoరాజు పై నిరసన జ్వాలలు
- వైస్సార్సీపీ పార్టీ ఎమ్ ఎల్ లు ,మంత్రుల పై ఎంపీ రఘురామ కృష్ణoరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం..
- రఘురామకృష్ణoరాజు డౌన్ డౌన్ నినాదాలతో దిష్టి బొమ్మ దగ్ధం చేసిన ఆచంట నియోజకవర్గ నాయకులు ,కార్యకర్తలు..
- మా నాయకుని పై లేని పోని మాటలు బురద జల్లే కార్యక్రమం చేస్తే చూస్తూ ఊరుకోం..
- నాలుక కోస్తాం అంటూ హెచ్చరించిన వైసీపీ శ్రేణులు
కృష్ణాజిల్లాలో జిరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా మధిర వాసులు దుర్మరణం చెందడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
-గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షా.
-మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశం
ఈ నెల 19 ఆర్టీసీ కార్గో బస్సుల ప్రారంభం
- ఈ నెల 19 రవాణా శాఖ ఖైరతాబాద్ కార్యాలయంలో ఆర్టీసీ కార్గో బస్సులు ప్రారంభించనున్న రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్.
- ఇప్పటికే కార్గో కోసం 80 బస్సులు సిద్ధం చేసిన ఆర్టీసీ.
- లాక్ డౌన్ సమయం లో కార్గో బస్సులను పలు సేవలకు ఉపయోగించిన ఆర్టీసీ.
- కార్గో బస్సులతో పాటు & ఆర్టీసీ పార్శిల్ సర్వీసుల ను ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ అజయ్.
- ఇప్పటి వరకు ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నడిచే పార్శిల్ సెంటర్లు ఇక నుండి ఆర్టీసీ అన్ని బస్ స్టాండ్ లలో నడిపిస్తుంది.