ఈరోజు సినీ వర్గాలతో సీఎం జగన్ భేటీ!
- సినిమా పరిశ్రమకు సంబంధించి చర్చలకు అమరావతి సినీ బృందం
- చిరంజీవి తో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు
- పుట్టినరోజు కారణంగా హాజరుకాలేకపోతున్న బాలకృష్ణ
- ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం
ఏపీలోనూ శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు
- 5 వేలకు చేరువలో బాధితులు!
- నిన్న ఒక్క రోజే వెలుగు చూసిన 154 కేసులు
- ఇప్పటి వరకు 75 మంది మృతి
- 24 గంటల వ్యవధిలో 14,246 మంది నమూనాల పరీక్ష
భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత
మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్రం నుండి కృష్ణా జిల్లాకు ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి, వారి వద్ద నుంచి 236 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న గంపలగూడెం పోలీసులు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
రుతుపవనాలు వచ్చేశాయి!
మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో బలపడనుందని విపత్తుల శాఖ వెల్లడించింది.
దీని ప్రభావంతో రాగల 4 రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.