Live Updates:ఈరోజు (జూన్-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-09 01:26 GMT

ఈరోజు మంగళవారం, 09 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, చవితి (రాత్రి 07:38 వరకు), తదుపరి పంచమి, ఉత్తరాషాడ నక్షత్రం (మధ్యాహ్నం 02.00 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:49 pm

ఈరోజు తాజా వార్తలు




Live Updates
2020-06-09 15:55 GMT

ఈ రోజు అధికంగా 178కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,920కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

2020-06-09 15:12 GMT

 -గన్నవరం పరిధిలో భారీగా పట్టుబడుతున్న మద్యం.

-తనిఖీలు ముమ్మరం చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టీమ్

-విజయవాడ రెడ్ జోన్ ప్రకటించిన కారణంగా మద్యం ప్రియులు గ్రీన్ జోన్ పరిధిలోని ప్రభుత్వ మద్యందుకాణాల నుండి మద్యం కొనుగోలు చేసి విజయవాడ ప్రాంతాల్లో అధిక రేట్లకు విక్రయించటం అలవాటుగా మారింది.

-ఈరోజు గూడవల్లి వద్ద తనిఖీలు నిర్వహించిన SEB. టీమ్.

-వేరు వేరు వాహనాల్లో 427 మద్యం సీసాలు గుర్తించి 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని 11 వాహనాలను సీజ్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలింపు.




2020-06-09 15:10 GMT

విశాఖ :కొయ్యూరు మండలం డౌనూరు వద్ద పోలీసుల తనిఖీలు.

-లారీలో తరలిస్తున్న వెయ్యి కేజీల గంజాయి పట్టివేత.

-ఇద్దరు అరెస్ట్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం... వాహనం సీజ్.

2020-06-09 15:09 GMT

రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు

-విచారించనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.

-ధర్మాసనంలో సభ్యులుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హృషికేష్ రాయ్ లు.

-రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై విచారణ.

2020-06-09 06:58 GMT

సీఎం జగన్మోహన్ రెడ్డి ని కలిసేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సినీ ప్రముఖులు బృందం.

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వారిలో హీరోలు చిరంజీవి , నాగార్జున , దర్శకులు రాజమౌళి , నిర్మాతలు డి.సురేష్ బాబు.



2020-06-09 06:03 GMT

మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిన మరొక గ్రామ వాలంటరీ.

-మద్యం ను తరలిస్తున్న పివి గూడెం గ్రామ వార్డ్ వాలంటీర్ అరెస్ట్.

-కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పెంటెల వారి గూడెం గ్రామ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుండిఅక్రమ మద్యం సరఫరా అడ్డుకున్న పోలీసులు.

-ఫుల్ బాటిల్స్ 13,బీర్ బాటిల్2 లను తీసుకు వస్తున్న పెంటేల వారి గూడెం గ్రామ వాలంటీర్ నరేంద్ర ను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ అధికారులు.

-పోలీస్ లకు అప్పగింత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు.

2020-06-09 05:47 GMT

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన యువతి కొమ్ము శ్రుతి అదృశ్యం.

-ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన శ్రుతి.

-తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు.

-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

2020-06-09 05:47 GMT

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బాలంపేట్ గ్రామంలో దారుణం.

* భార్యను, మామను అతికిరాతకంగా నరికి, చంపిన అల్లుడు.

* పోలీసుల అదుపులో నిందితుడు.

* సంఘటన స్థలాన్ని చేరుకొని విచారిస్తున్న పోలీసులు.

2020-06-09 05:46 GMT

* కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపెట్ వద్ద అదుపు తప్పిన డిసిఎం వ్యాన్.

* అవతలి రోడ్డులో ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొన్న డీసీఎం.

* బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి, మరొకరి పరిస్థితి విషమం.

2020-06-09 02:51 GMT

- జీవో నెంబర్ 3 ని రద్దుని వ్యతిరేకిస్తూ ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజన సంఘాలు చేపట్టిన బంద్ కు అందరూ మద్దతు పలుకుతున్నారు.

- ఎటువంటి వాహనాలను రోడ్డు పైకి అనుమతించడం లేదు.

- ఆర్టీసీ బస్సులను ముందస్తు చర్యల్లో భాగంగా నిలిపివేశారు.

- దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు.

- పర్యాటక ప్రదేశాలకు కూడా మూసివేయబడ్డాయి.

- ఈ బంద్ కు ఏజెన్సీలో ని సుమారు 40 గిరిజన సంఘాలు తమ మద్దతు ను ప్రకటించాయి.

- ఈ బంద్ కు రాజకీయ పార్టీలతో పాటు మావోయిస్టులు కూడా సమర్థించడం కొసమెరుపు


 

Tags:    

Similar News