Live Updates:ఈరోజు (జూన్-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-06 01:02 GMT

ఈరోజు శనివారం, 06 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పాడ్యమి (రాత్రి 10:32వరకు), తదుపరి విదియ సూర్యోదయం 5:40 am, సూర్యాస్తమయం 6:48 pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-06-06 16:23 GMT

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్య అధికారులతో సమావేశమైన సీఎం.. తీర్పుపై చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని శనివారం సాయం‍త్రం హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. 

2020-06-06 11:42 GMT

కడప: పులివెందులలో పర్యటించిన కలెక్టర్ సి. హరికిరణ్.

* జులై నెలలో ఏపీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పరిశీలించిన పర్యటన ప్రాంతాలు.

* కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్టాండ్, పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, ఆటోనగర్ తదితర ప్రాంతాలను పరిశీలన.

* అనంతరం అధికారులతో సమీక్షిoచిన కలెక్టర్.

2020-06-06 11:41 GMT

విశాఖ. జి.కె.వీధి మండలం వంతాడపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలు విలువ చేసె 900 వందల కేజిల గంజాయిని ఐషర్ వేన్లో తరలిస్తుండాగా పట్టుకొన్న చింతపల్లి ఎక్సైజ్ సిబ్బంది.

-డ్రయివర్ పరారీ ఐషర్ వేన్ సీజ్.

-ఐషర్ వేన్ తుార్పుగోదవరి జిల్లా రాజవొమ్మంగి గ్రామమునకు చెందిన జి.సత్తిబాబు అనె వ్యక్తి పేరు మీద ఉందని,దర్యాప్తు చేసి అతన్ని కస్టడీలోకి తీసుకొంటామని తెలిపారు.




2020-06-06 07:42 GMT

తెలంగాణ రాష్ట్రం లోని కొత్తగూడెం నుంచి గుంటూరు కు అనధికారికంగా 27 లక్షల రూపాయలు కారులో తరలిస్తున్న సురసానిశ్రీనివాసరెడ్డి ని తిరువూరు పోలీసులు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డీ ఎస్ పీ శ్రీనివాసులు విలేఖరుల సమావేశంలో తెలిపారు

2020-06-06 07:27 GMT

- చంద్రగిరి మండలంలోని గంగుడుపల్లి ఆటవిసమీపప్రాంతంలో ఎస్.సి.బి అధికారులు దాడులు.

- సారా కాస్తున్న ముగ్గురు గంగుడుపల్లి చెందిన వారిని అదుపులోకి తీసుకున్న ఎస్.సి.బి అధికారులు.

- వేయి లీలటర్ల నాటుసారా వూటను ద్వoసం, పరికరాలు స్వాధీనం చేసుకున్న అధికారులు.



2020-06-06 06:45 GMT

టాలీవుడ్ సినీ ప్రతినిధుల బృందం ఈనెల 9న ఏపీ సీఎం జగన్‌తో భేటీ కానుంది. మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసే ప్రతినిధి బృందంలో నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులు ఉంటారు. ఈ భేటీకి నటుడు బాలకృష్ణను కూడా ఆహ్వానించినట్లు నిర్మాత సీ కళ్యాణ్‌ తెలిపారు.

పుట్టిన రోజు కారణంగా తాను రాలేనని బాలకృష్ణ అన్నట్లు కళ్యాణ్‌ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సీఎంతో చర్చించనున్నట్లు ప్రకటించారు సి.కళ్యాణ్.

2020-06-06 06:43 GMT

పేదల ఇళ్ల పంపిణీ పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కామెంట్స్...

- ఎవరు అడ్డంకులు సృష్టించినా జూలై 8 తేదీన స్థలాల పంపిణీ జరిగి తీరుతుంది....

- రాష్ట్రంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఎన్ని సార్లు కోర్ట్ మెట్లెక్కినా సుప్రీం కోర్ట్ కి వెళ్ళైనా సరే పేదలకు స్థలాలు పంపిణీ చేస్తాం....

- పేదల పంపిణీ భూములు కొనుగోలు విషయంలో ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని ప్రమేయం లేదు ...

- రాష్ట్రంలో కేవలం సంబంధిత రెవెన్యూ అధికారులకు మాత్రమే అధికారాలు ఇవ్వడం జరిగింది....

ఇసుక కొరత గురించి 

- చంద్రబాబు నాయుడు కూడా గతంలో జన్మభూమి పేరుతో తన వాళ్ళకు కోట్ల రూపాయలతో విలువ ఇసుకను దోచి పెట్టారు...

- అక్రమ ఇసుక పూడిక కేసులో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలి..



 


2020-06-06 05:58 GMT

విశాఖజిల్లా కిరండల్ రైల్వే లైన్ పై ప్రమాదం 

* కెకే లైన్ లో చిమిడిపల్లి - బొర్రా రైల్వే స్టేషన్ ల మధ్య ప్రమాదం.

* 65/39 కిలోమీటర్ల వద్ద మళ్ళీ జారిపడ్డ కొండచరియలు.

* గత నెలలో రాళ్లు పడి నలుగురు మృతికి కారణమైన ప్రాంతం ఇదే.

* అదే చోట మరలా జారి పద్ద రాళ్లు.

ట్రాక్ పునరుద్దరణకు చర్యలు చేపట్టిన రైల్వే శాఖ.



2020-06-06 04:51 GMT

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,987 కేసులు నమోదు కాగా, 294 మంది ప్రాణాలు విడిచారు.


                                                         - పూర్తి వివరాలు

 


2020-06-06 02:36 GMT

హైదరాబాద్‌: నేడు పదో తరగతి పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో విచారణ..

►కంటైన్‌మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాల వివరాలు ఇవ్వాలన్న కోర్టు

Tags:    

Similar News