Live Updates:ఈరోజు (జూన్-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-04 00:54 GMT
Live Updates - Page 2
2020-06-04 07:42 GMT

- కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తం

- పేదల పైరున ఉన్న భూమి లంచం తీసుకుని పెద్దలకు సహకరిస్తున్నారంటూ వందమంది తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన

- ఒకానొక దశలో మాకు అన్యాయం చేశారు తహశీల్దార్ అంటూ భూ యజమాని కొడుకు చుండ్రు. రాజశేఖర్ (30) కార్యాలయ ఆవరణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

- పురుగు మందు తాగిన యువకుడిని ఆసుపత్రికి తరలించి తాసిల్దార్ కార్యాలయం ముట్టడించిన దళితులు ఒకానొక దశలో మాకు అన్యాయం చేసావ్ మా బిడ్డ చనిపోతే నీ అంతు చూస్తానంటూ చొక్కా పట్టుకుని తహసిల్దార్ ని బయటకు లాగిన లాగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది

- సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులతో చర్చిస్తున్నారు

2020-06-04 07:41 GMT

ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం జీ. వేమవరంలో రైతు పొలంలో పనిచేస్తుండగా పిడుగు పాటుకు గుండెమొగుల చంటి (65) మృతి..

2020-06-04 06:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 141 కేసులు..

-గడచిన 24 గంటల్లో 141 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ.

-రాష్ట్రంలో 98 పాజిటివ్‌ కేసులు వచ్చాయి

-వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు 43

-ఇప్పటివరకు మొత్తం 4,112 కేసులు నమోదయ్యాయి.

-24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు.

-కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 71కి చేరింది.

-డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,273కి చేరింది.

-ప్రస్తుతం1,033మంది చికిత్స పొందుతున్నారు.

2020-06-04 05:53 GMT

- విశాఖ జిల్లా వ్యాప్తంగా వర్షాలు

- ఏజెన్సీలో తోడయిన ఈదురు గాలులు

- పాడేరులో ఈదురుగాలులతో కూడిన వర్షం.

- ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి నివాసం వద్ద విద్యుత్ స్తంభాలపైన పడిన చెట్టు.

- విద్యుత్ సరఫరా కు అంతరాయం



2020-06-04 05:51 GMT

డబ్బు కోసం తండ్రిని చంపిన తనయుడు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అవసరాలకు డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో బుధవారం రాత్రి కన్న తండ్రి తలపై తనయుడు ఇటుకలతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన తండ్రి కనకయ్యను కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మ‌ృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

2020-06-04 05:44 GMT

విశాఖజిల్లా మాకవరపాలెం మండలంలో సర్పా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసుల దాడులు.

ఐదు ట్రాక్టర్ లు సీజ్.

ఐదుగురిపై కేసు నమోదు.

2020-06-04 05:18 GMT

నోయిడాలో భూప్రకంపనలు..భయాందోళనల్లో ప్రజలు

ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో బుధవారం అర్దరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. నోయిడాలో దక్షిణ తూర్పున 19 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. నోయిడాలో 3.8 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. గత వారం రోజుల్లోనే ఢిల్లీతోపాటు హర్యానాలోని రోహతక్ కేంద్రాలుగా భూమి కంపించింది. మే 29న రోహతక్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఏప్రిల్ 12,13 తేదీల్లో ఢిల్లీలోనూ స్వల్పంగా భూమి కంపించింది. ఢిల్లీతోపాటు చుట్టుపక్కల నగరాల్లో భూప్రకంపనలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 

2020-06-04 05:17 GMT

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారి గూడెంలో దారుణం జరిగింది. భర్త అప్పారావు(35) ను భార్య లక్ష్మీ పాశవికంగా హతమార్చింది. భర్తను చంపి అనంతరం భార్య పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

2020-06-04 04:53 GMT

హరిద్వార్ రిషికేశ్ వెళ్లిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

శ్రీ విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి హరిద్వార్ రిషికేశ్ లో నాలుగు నెలలపాటు చతుర్ మాస దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈరోజు ఉదయం విశాఖ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ బయల్దేరి వెళ్లారు.



 


2020-06-04 04:06 GMT

భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్.

గడచిన 24 గంటలలో అత్యధికంగా 9,304 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

• గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 260 మృతి.

• దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919

• దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,06,737

• “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,04,107.

• “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 6,075

Tags:    

Similar News