Live Updates:ఈరోజు (జూన్-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు గురువారం, 04 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, త్రయోదశి (ఉదయం 06:05 వరకు), తదుపరి చతుర్దశి సూర్యోదయం 5:40 am, సూర్యాస్తమయం 6:48 pm
ఈరోజు తాజావార్తలు
తూర్పు గోదావరి :
కాకినాడ లో తుపాకీతో కాల్చుకున్న ఎఆర్ కానిస్టేబుల్ అరదాడి నరసింహ వర్మ
తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలింపు
విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తు లో భాగంగా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో విచారణ చేపట్టిన C B I అధికారులు.
డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తు లో భాగంగా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో లో రికార్డులు పరిశీలించిన C B I అధికారులు
హైదరాబాద్ నగరంలో ఓ కరోనా బాధితుని ఇంట్లో జరిగిన చోరీ. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. దొంగలు ఆయన ఇంటికి కన్నం వేసి ఉన్నదంతా దోచుకెళ్లారు. ఇప్పుడు ఈ చోరీ ఘటనే నగరంలో కలకలం రేపుతుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖజిల్లా నర్సీపట్నం నూతన A.S.P.గా భాద్యతలు చేపట్టిన తూహిన్ సిన్హా
తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కరోనావైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కోవిడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతూన్నాయి. కాగా తాజాగా ఏపీలోని వాలంటీర్‌కు కరోనా వైరస్ సోకింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని వాలంటీర్‌కు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది.
కరోనా పోరులో ముందున్న ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దీనిపై ఒక ప్రత్యేకమైన వీడియో గీతాన్ని రూపొందించింది. అయితే దీనిలో ప్రత్యేకంగా సినీనటులు నిఖిల్, కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్తో పాటు తమ రాగం కలిపారు. దీనిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సారధ్యం వహించారు.
విశాఖపట్నం: ఎల్.జీ.పాలిమర్స్ వ్యవహారంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కంపెనీ అత్యవసర పనుల కోసం 30 మందిని అనుమతించాలని ఎల్.జీ.పాలిమర్స్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి వేరే బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
విశాఖపట్నం: జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలిలో వర్షం కురిసింది. ఎండవేడితో ఉక్కపోతకు గురై ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. గత వారం రోజులుగా భానుడి ప్రతాపంతో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. ఉరుములు, మెరుపులతోపాటు రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. పలు రహదారులు జలమయమయ్యాయి.
వాహనమిత్ర పధకం ద్వారా ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న రూ 10,000 సాయం చేయడం ఆయా కుటుంబాలకు ఎంతో ఆసరా ఇస్తుందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. వాహన మిత్ర ద్వారా సాయం చేసినందుకు కృతజ్ఞతగా ఆటోడ్రైవర్లు స్థానిక చింతచెట్టు సెంటర్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారన్నారు. అధికారం చేపట్టిన ఏడాది లోపే 90 శాతం హామీలను నెరవేర్చున ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావుతో పాటు పలువురు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.