Live Updates:ఈరోజు (జూన్-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-02 00:52 GMT

ఈరోజు మంగళవారం, 02జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఏకాదశి (మధ్యాహ్నం 12:04 వరకు), తదుపరి ద్వాదశి.సూర్యోదయం 5:40am, సూర్యాస్తమయం 6:47 pm.

Live Updates
2020-06-02 17:01 GMT

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఎ.పరమేశంను నియమిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు

▪ప్రస్తుతం ఆయన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్కే గుప్తాకు కేంద్రం పదోన్నతి కల్పించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యునిగా నవంబర్ 30న నియమించిన విషయం తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోగా పనిచేస్తున్న ఆర్కే జైన్‌కు కేంద్రం పదోన్నతి కల్పించి సీడబ్ల్యూసీ చైర్మన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు చైర్మన్, పీపీఏ సీఈవో బాధ్యతలను కూడా గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నిర్వహిస్తూ వస్తున్నారు.

2020-06-02 15:44 GMT

అమలాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి బి హెచ్ భవాని శంకర్ ఆకస్మిక బదిలీ భవాని శంకర్ ను కృష్ణాజిల్లా నూజివీడు ఆర్టీవో గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు




2020-06-02 13:59 GMT

పెనుగంచిప్రోలు మున్నేరు నది లో పిడుగు పడిన దృశ్యం




2020-06-02 13:53 GMT

➡️ ఒక్కరోజులోనే 28 కరోనా పాజిటివ్ కేసులు

➡️ కోనసీమను వణికిస్తున్న వలస కూలీలు

➡️ పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా

➡️ రాజోలు క్వారంటైన్ లోని 12 మందికి, రావులపాలెంలో ఐదుగురికి, ముమ్మిడివరంలో ముగ్గురికి, అమలాపురంలో ఏడుగురికి, పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క రోజే 28 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోనసీమ ఉలిక్కిపడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

2020-06-02 13:52 GMT

-మరికొద్ది సేపట్లో గుంటూరు నగరాన్ని మరోసారి రెడ్ జోన్ గా ప్రకటించనున్న జిల్లా అధికారులు.

-సడలింపు ఇచ్చిన కొద్ది గంటలకే మూతపడనున్న దుకాణాలు.

-వ్యాపారుల ఆశలను సజీవంగా నాశనం చేసిన కరోనా మహమ్మారి...

2020-06-02 12:33 GMT

ఆంధ్రప్రదేశ్‌లో జులై 10 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

పరీక్షలు నాటికి కరోనా కేసులు వస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు.

‘‘ప్రతి గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటాం.

మొత్తం 4,154 పరీక్షా కేంద్రాలను గుర్తించాం.

ప్రతి పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్, మాస్కులను అందుబాటులో ఉంచుతాం.

ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు 1,022 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం.

కంటైన్మెంట్‌ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఉండవు’’ అని మంత్రి సురేశ్‌ పేర్కొన్నారు.

2020-06-02 12:16 GMT

మహారాష్ట్రలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో మొదలైన వాన ప్రజలను వణికించేసింది.    నాగపూర్ లో గాలివాన బీభత్సం తీవ్రంగా ఉంది.  పెనువగంతో వీచిన  గాలుల ప్రభావానికి పలు   నిర్మాణాలు ధ్వంసమయ్యాయి, గాలి వానకు తోడు పిడుగులు కూడా పడ్డాయి, పిడుగు పాటుకు  వందలాది జంతువులు మరణించాయి. పెను గాలులకు భారీ చెట్లు,  విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి.

2020-06-02 11:27 GMT

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గోదావరిలో స్నానానికి దిగిన ఇరువురు యువకులు గల్లంతు.

కడియం మండలం వీరవరం చెందిన వారిగా గుర్తింపు.

వారికోసం గాలింపు....

ఇటీవల కడియపులంక యువకుడు మృతి చెందిన ప్రదేశంలోనే ఈ యువకులు గల్లంతు.

2020-06-02 11:26 GMT

హైదరాబాద్..కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఏసీలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బందికి కానీ, కస్టమర్లకు కానీ ఎవరికి ఎటువంటి హాని జరగలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. నష్టం అంచనా వేయటానికి ప్రత్యేక బృందం వస్తుందని సిబ్బంది తెలిపారు.

2020-06-02 10:11 GMT

-జేసీ ట్రావెల్స్ కు మరోసారి షాక్..

-మరోసారి జేసీ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాలు సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు.

-బీఎస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో వాహనాలను సీజ్ చేసిన అధికారులు.

-వీటిని నాగాలాండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించిన అధికారులు

-గతంలో 57 వాహనాలను సీజ్ చేసిన అధికారులు.

-తాజాగా ఇవాళ 4 టిప్పర్లను సీజ్ చేసిన రవాణాశాఖ అధికారులు.

-మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు చెబుతున్న అధికారులు

-త్వరలో వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామన్న డీటీసీ శివరామప్రసాద్

Tags:    

Similar News