దేవస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు
-శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ.2.12 కోట్ల స్కాం
-27 మంది అరెస్ట్
-డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా మోసాలు
శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో కోట్ల విలువైన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో నిందితులపై 4 కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో మొత్తం 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్టు గుర్తించారు.
షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ చేంజ్ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది. ఈ కుంభకోణంలో మొత్తం రూ.2.12 కోట్లు స్వాహా జరిగినట్టు తేల్చారు. పోలీసులు ఇప్పటివరకు రూ.83.40 లక్షలు రికవరీ చేశారు. కాగా, నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
సిఎం జగన్‌తో మంత్రులు, విజయసాయి కీలక భేటీ
-ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని భేటీ
-తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొనసాగుతున్న భేటీ.
-సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దవ్వగానే మంత్రులు ఆయన్ను కలవడం ప్రాధాన్యత .
-అరగంట నుంచి జరుగుతున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులతో పాటు ఎన్నికల కమిషనర్, ఢిల్లీ టూర్ రద్దు అయిన వ్యవహారంపై కూడా కీలక చర్చ
-ఈ భేటీ అనంతరం కొడాలి నాని లేదా విజయసాయి మీడియా మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. రెండో బ్లాక్‌లోని హోం, రెవెన్యూ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులకు పరీక్షలు చేశారు. మూడ్రోజులపాటు ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
నిమ్మగడ్డ వ్యవహారంలో కీలక పరిణామం...
హైకోర్టు తీర్పుపై స్టే పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ప్రభుత్వం
కృష్ణా జిల్లా: ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గరికపాడు వద్ద ఏపి39 ఏయం 1000 ఇన్నోవా కారులో భారీగా తరలిస్తున్న అక్రమ మధ్యo బాటిళ్లను 77 పట్టుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 115 కేసులు...
-ఆంధ్రప్రదేశ్‌లో 115 పాజిటివ్ కేసులు నిర్ధారణ.
-వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు 33.
-రాష్ట్రంలో 82 పాజిటివ్ కేసులు వచ్చాయి.
-ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,791 కేసులు నమోదయ్యాయి.
-మృతుల సంఖ్య 64 కి చేరింది.
-ఇప్పటి వరకు 2,209 డిశ్చార్జ్ అయ్యారు.
-927 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆ తరువాత కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురువేశారు.
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు
-సిద్దిపేటలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.
-ఈ సందర్భంగా ఆయన అమరవీరుల స్థూపాలకు గోదావరి జలాలతో నివాళులర్పించారు.
-ఆ తరువాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు.
-ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం పురోగమిస్తున్నదని తెలిపారు.
-దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని వెల్లడించారు.
గన్ పార్క్ వద్ద అలజడి..
-కేసీఆర్ కాన్వాయ్‌లోకి దూసుకెళ్లిన యువకుడు
-సీఎం కారు డోర్ దగ్గరకు దూసుకెళ్లాడు.
-డబుల్ బెడ్రూం ఇల్లు కోసం సీఎం కాన్వాయ్‌కు అడ్డుతగిలిన యువకుడు.
-వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.