వరంగల్ అర్బన్.
వరంగల్‌లో దారుణం.. ఒకే చితిపై నాలుగు మృతదేహాలు..
కరోనా మృతదేహాల కాల్చివేతలో నిబంధనలు, సంప్రదాయాలను అధికారులు గాలికి వదిలేశారు. ఒకే చితిపై నాలుగు మృతదేహాలను దహనం చేస్తున్నారు.
మూడు చితుల్లో 9 మృతదేహాలకు పైనే కాల్చివేశారు.
ప్రభుత్వం చెప్తున్న కరోనా మృతుల సంఖ్యకు.. కాలుతున్న చితిమంటలకు పొంతన ఏమాత్రం కుదరడం లేదు.
పోతన శ్మశాన వాటికలో ఘటన..
అర్థరాత్రి, అపరాత్రి అనక రోజుకు పదుల సంఖ్యలో మృతదేహాలను కాలుస్తున్నారని స్థానికులు ఆందోళన..
తూర్పుగోదావరి -రాజమండ్రి
కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్న కళాకారులకు రాజమండ్రి సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చేయూత
ఉభయ గోదావరి జిల్లాల డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులకు సాయం అందించిన తెలుగుదేశంనేత భవాని చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేసారు.
గుంటూరు:
కలెక్టరేట్ లో కోవిడ్ ఉద్యోగుల ఆందోళన.
మొబైల్ ల్యాబ్ బస్సులలో పని చేస్తున్న సిబ్బంది.
రెండు నెలల నుంచి జీతాలు లేవని ఆవేదన.
వీరా ఏజెన్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన 170 మంది.
జీతాలు అడిగితే కేసులు పెడతామని బెదిరింపులు.
వీరా ఏజెన్సీ తీరుకు నిరసన గా కలెక్టరేట్ లో బస్సులు నిలిపివేసి నిరసనలు
ప్రాణాల కు తేగించి వైద్య సేవలు చేస్తే ....మమ్మల్ని బెదిరించే దోరణిలో వీరా ఏజెన్సీ ఉంది.
ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి.
తూర్పుగోదావరి -రాజమండ్రి
సీతానగరం పోలీసు స్టేషన్ శిరోముండనం కేసులో మాజీ సర్పంచ్ కవల కృష్ణమూర్తిని అరెస్టు చేయాలి
అతని ఫోన్ కాల్ డేటాను పోలీసులు బయట పెట్టాలి
రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ లో దళిత, గిరిజన ఐక్యవేదిక నాయకుల నిరసన
పాల్గొన్న ఐక్యవేదిక నాయకులు తుమ్మల తాతారావు, కొల్లం రత్నం, అజ్జరపు వాసు, వైరాల అప్పారావు, ముమ్మిడివరపు చిన సుబ్బారావు, కాశి నవీన్‌కుమార్, పట్నాల విజయ్ కుమార్ తదితరులు
కామారెడ్డి :
కామారెడ్డి బల్దియా కో ఆప్షన్ ఎన్నిక పూర్తి
జనరల్ కేటగిరీలో మాసుల లక్ష్మీనారాయణ ఏకగ్రీవం
జనరల్ మహిళా కేటగిరీలో పుల్లూరి జ్యోతి ఎన్నిక
మైనారిటీ కేటగిరీలో జమీర్, ఇర్ఫానా బేగం అత్యధిక ఓట్లతో ఎన్నిక
అనుకున్న విధంగానే మున్సిపల్ కో అప్షన్ టిఆర్ఎస్ కైవసం
కో ఆప్షన్ ఎన్నికలో పాల్గొని ఎక్స్ అఫిషియో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
గుంటూరు:
సత్తెనపల్లి,అచ్చంపేటలలో అక్రమంగా తరలిస్తున్న మధ్యం బాటిళ్ళను సీజ్ చేసిన రూరల్ పోలీసులు...
వారం రోజుల క్రితం మూడు వేల మద్యం బాటిళ్ళు పట్టుకున్నాం....
5218 మద్యం బాటిళ్ళను సీజ్ చేశాం.
పడవల ద్వారా అక్రమ మద్యం సరఫరా జరుగుతుందనే సమాచారంతో దాడులు చేశాం.
నల్గొండ నుండి గుంటూరుకు చెందిన నలుగురు వ్యక్తులు ఏపికి మద్యం తరలిస్తుండగా పట్టుకున్నాం.
పది లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్ళను సీజ్ చేశాం...
నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం.
డిజిపి ఆదేశాల మేరకు అక్రమ మద్యం,ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టాం.
రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ...
నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
మధ్యాహ్నం 2 గం. లకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జల వివాదాలపై దృష్టి
అపెక్స్ కమిటీ సమావేశం కోసం కేంద్ర జలశక్తి శాఖ రాసిన లేఖపై చర్చ
కడప:
కడప నగర శివారులలోని కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పరమర్శించేందుకు వచ్చిన టీడీపీ నేతలు...
ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న సమాచారం మేరకు పరామర్శించడానికి వచ్చిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి...
ములాఖత్ కు అనుమతి లేక పోవడంతో వేనుదిరిగిన టీడీపీ నేతలు...
ఆరోగ్య పరిస్థితి సరిలేదంటూ అనంతపురం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రెడ్డి న్యాయవాది నేడో రేపో బెయిల్ పిటిసన్ పై విచారణ...
విజయవాడ
వన్ టౌన్ లో దారుణం..
బిల్డింగ్ పై ఆడుకుంటూ... వాటర్ ట్యాంకులో పడిన నాలుగేళ్ళ బాలుడు మృతి..
ఆలస్యంగా గుర్తించడంతో ప్రాణాలు కోల్పోయిన బాలుడు..
శనివారం బాలుడి పుట్టిన రోజు చేసేందుకు ఏర్పాట్లు చేసిన తల్లిదండ్రులు
తల్లి ఎనిమిది నెలల గర్భవతి.. త్వరలో తమ్ముడో, చెల్లితో ఆడుకుంటానన్న బాలుడు
బాలుడి మాటలను గుర్తు చేసుకుంటూ... కన్నీరుపెట్టిన తల్లిదండ్రులు..
విజయవాడ :
క్రోవిడ్ ప్రభుత్వాసుపత్రిలో నకిలీ డాక్టర్ కలకలం
కరోనా వైరస్ ను అడ్డంపెట్డుకుని వైద్యురాలి అవతారంలో చోరీలకి పాల్పడ్డ శైలజా అనే మహిళ
వైద్యులు విధులు ముగించిన తర్వాత వారు ఉపయోగించే పీపీఈ కిట్లను ధరించి చోరీకి యత్నించిన శైలజా..
కిట్ వేసుకోవడంతో నిజమైన వైద్యురాలనుకున్న సిబ్బంది, పేషెంట్లు..
కొవిడ్ బాధితులు ఆదమరిచిన సమయంలో వారి ఫోన్లను ఎత్తుకెళ్లిన శైలజా..
బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ వారికి మెరుగైన సేవలు అందిస్తానని నమ్మబలుకుతూ డబ్బులూ వసూలు..
పిపి కిట్‌తో బయటకు వెళ్తుండటంతో శైలజను నిలదీసిన సిబ్బంది..
సిబ్బంది అడ్డుకోవడంతో పారిపోయిన శైలజా
పోలీసులకు పిర్యాదు చేసిన సుపరిడెంట్ నాచారయ్య..
శైలజను అదుపులోకి విచారిస్తున్న పోలీసులు..
శైలజతో పాటు మరో ఇద్దరు ఆసుపత్రిలోకి మారువేషంలో వచ్చినట్టు గుర్తించిన పోలీసులు..
గతంలోనూ శైలజా ఆమె భర్త సత్యనారాయణపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..