Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 30 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం ఏకాదశి (రాత్రి 12-39 వరకు) తదుపరి ద్వాదశి; అనురరాధ నక్షత్రం (ఉ. 9-36 వరకు) అమృత ఘడియలు ( రాత్రి 11-07 నుంచి 1-39 వరకు), వర్జ్యం (మ. 2-56 నుంచి 4-28 వరకు) దుర్ముహూర్తం ( ఉమ. 2-56 నుంచి 4-28 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-41సూర్యాస్తమయం సా.6-31
ఈరోజు తాజా వార్తలు
- ఢిల్లీ లోని గంగారామ్ హాస్పటల్ లో సాయంత్రం 7 గంటలకు చేరిన సోనియా గాంధీ
- రొటీన్ టెస్ట్ లు మరియు పరీక్షల కోసమే అని వైద్యుల వెల్లడి
- నేడు మధ్యాహ్నం అంతా పార్టీ రాజ్యసభ ఎంపీలతో సమావేశం అయిన సోనియా గాంధీ
- ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గంగారామ్ హాస్పటల్ ఛైర్మన్ డా.డిఎస్ రాణా వెల్లడి
గుంటూరు : తన భర్త కనిపించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన తెనాలి కి చెందిన వెంకాయమ్మ
- వెంకాయమ్మ భర్త జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గుర్తింపు
- మార్చురీలో భర్త మృతదేహాన్ని చూసి ధృవీకరించిన వెంకాయమ్మ
- 12 రోజులు గా తన భర్త ఆచూకి లేదని కోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు.
- మీడియా లో కధనాలు, కోర్టును ఆశ్రయించడంతో చనిపోయినట్లు నిర్దారించిన జిజిహెచ్ సిబ్బంది.
• దేశ రాజధానిలో గడచిన 24 గంటలలో 1093 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు.
•. గడచిన 24 గంటలలో డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 1091
• గడచిన 24 గంటలలో “కరోనా” కారణంగా 29 మంది మృతి.
• దేశ రాజధానిలో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 1,34,403 మొత్తం మృతుల సంఖ్య 3,936
• ఇప్పటివరకు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,19,724
• ఢిల్లీ లో “యాక్టివ్” కేసుల సంఖ్య 10,743.
• ఢిల్లీ లో ఈరోజు నిర్వహించిన “కరోనా” RTPCR టెస్ట్ ల సంఖ్య 5,531.
. ఢిల్లీ లో ఈ రోజు నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్ ల సంఖ్య 13,944
• దేశరాజధానిలో ఇప్పటి వరకు నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 10,13,694
• దేశ రాజధాని లో హోం ఐసోలేషన్ లో ఉన్న కేసుల సంఖ్య 5,873
• ఢిల్లీ లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 694
• ఢిల్లీ లో ప్రభుత్వ / ప్రైవేట్ హాస్పటల్స్ లో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 15,634
• ప్రతి మిలియన్ జనాభాలో కరోనా టెస్ట్ ల సంఖ్య 53,352
• దేశరాజధానిలో రికవరీ రేటు శాతం 88
విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై అమరావతి మహిళా జేఏసీ & కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఫైర్
- సోము వీర్రాజును చూస్తే చదవక ముందు కాకరకాయ చదివిన తర్వాత కికరకాయ సామెత గుర్తుకు వస్తుంది
- పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత సోము వీర్రాజు గతంలో ఏం మాట్లాడమో గుర్తు లేకుండా మాట్లాడుతున్నారు
- సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ కార్యకర్తల కంటే వైసీపీ నాయకులే ఎక్కువ సంతోషపడుతున్నారు
- అమరావతి రాజధాని విషయంలో మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు
- మేము అమరావతికి మద్దతు ఇస్తున్నాం.... ప్రపంచ స్థాయి రాజధాని కట్టుకోండి మేము సహకారం అందిస్తామని బీజేపీ నేతలు చెప్పలేదా ?
- చంద్రబాబు ఆహ్వానిస్తే అమరావతి శంకుస్థాపనకి ప్రధానమంత్రి వచ్చారని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గం
- రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రజలు కారా.. వారివి ప్రజా సమస్యలు కావా..
- అమరావతికి మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చిన లేఖను సోము వీర్రాజు వెనక్కి తీసుకుంటారా ?
- అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పిన మాటలను సోము వీర్రాజు మరచిపోయారా ?
- మీ చేతితో ప్రాణం పోసుకున్న అమరావతిని ముఖ్యమంత్రి జగన్ చంపాలని చూస్తుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ?
- రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అంటున్నప్పుడు కేంద్రం ఎందుకు మాట్లాడటం లేదు ?
- రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీ జోక్యం చేసుకోవాలి
- నటుడు సోనూ సూద్ జన్మదిన వేడుకలను జరిపిన రైతు నాగేశ్వరరావు కుటుంబం.
- మహల్ రాజపురంలో గ్రామస్తులతో కలిపి కేక్ కట్ చేసి సోనూ సూద్ కు శుభాకాంక్షలు తెలిపిన నాగేశ్వరరావు.
టీఎస్ హైకోర్టు.
ఖాజాగూడ చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఖాజాగూడ చెరువులో ప్రభుత్వమే రోడ్డు నిర్మిస్తోందన్న సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ లేఖపై హైకోర్టులో విచారణ
ఖాజాగూడ ఎఫ్ టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదని తెలిపిన ప్రభుత్వం
ఖాజా గూడ చెరువు పటాలు సమర్పించేందుకు రెండు వారాల సమయం కోరిన ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లాలోని చెరువుల కబ్జాలు, తీసుకున్న చర్యల్సపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
చెరువుల పరిరక్షణపై ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ఉండడం లేదని హైకోర్టు వ్యాఖ్య
ప్రగతి భవన్
సీఎం కేసీఆర్ ను కలిసినమహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్
మహబూబాబాద్ జిల్లా మాల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం (KVK) కి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ని మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
మల్యాల కేవీకే కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ జె.రఘోత్తం రెడ్డి 160 ఎకరాల భూమిని, రూ.1 కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారని సీఎంకు ఎమ్మెల్యే వివరించిన శంకర్ నాయక్
దీనికి అనుసంధానంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి
నాలుగురోజుల క్రితం రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కేవీకేను సందర్శించి, నివేదిక కూడా ఇచ్చారని గుర్తు చేశారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభిద్దామని సీఎం కేసీఆర్ హామీ
సిద్దిపేట జిల్లా:
వర్గల్ మండలం వేలూరు లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
* మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు గౌరారం పోలీస్ స్టేషన్ కు తరలింపు
హైదరాబాద్ లో బక్రీద్ సందర్భంగా ఆగష్టు 1, 2 తేదీలలో జంతు వధ శాలలతో పాటు బీఫ్ షాపుల మూసివేత - కమిషనర్ జిహెచ్‌ఎంసి
బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి సృజనా చౌదరి....
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ను నియమించడం సంతోషం..
ఆయన నాయకత్వం లో రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని ఆశిస్తున్నా..
గత సంవత్సరం నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మేము పనిచేసాం..ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై కన్నా లక్ష్మీనారాయణ భాగా పోరాడారు..
ఓ వైపు ప్రపంచం మొత్తం కోవిడ్ తో కొట్టుమిట్టాడుతుంటె...
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయి..
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పై కక్ష్య సాదిస్తుంది..
కోర్ట్ ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు..
భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ.. తమ పాలన ఏవిధంగా ఉందో ఓక సారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది..
అవసరాలకోసం రాజధాని ని మార్చడం ఏంటీ..
సెక్షన్ 5,6నిబంధనల కు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని గవర్నర్ దగ్గరకు ప్రభుత్వం తీసుకెళ్ళింది..
రాష్ట్రంలో మెత్తం ఇంగ్లీష్ మీడీయం అన్నారు.. కేంద్ర కేబినెట్ నిర్ణయం తో 5 తరగతి వరకు మదర్ టంగ్ కంపన్ సరి చేసింది..
రాజ్యంగంలో రాష్ట్ర రాజధాని అంశం పై కేంద్ర ప్రభుత్వానికే ఫైనల్ నిర్ణయం ఉంటుంది..
అమరావతి ని రాజధాని గా సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది..
2017 కేంద్ర బడ్జెట్ లో అమరావతి రైతు ఫూలీంగ్ లో రైతు లకు ట్యాక్స్ ఎగ్జెమ్షన్ చేసారు ...కాబట్టి రాజధాని మార్పు అంశం కేంద్ర పరిదిలోనే ఉంటుంది..
ప్రజా సమస్యలు గాలికొదిలేసి...అనవసర విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది..
అసలు రాజధాని మార్పు ఫైల్ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి.. సెలెక్ట్ కమిటీ ఆమోదించిందా లేదా అనేది తెలియడం లేదు..
ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు ,న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో అవినీతి బాగా పెరిగిపోయింది..
కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది..