Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-28 23:30 GMT
Live Updates - Page 3
2020-07-29 05:53 GMT

తూర్పుగోదావరి : రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ రివ్యూలో పాల్గొన్న డిప్యూటీ సిఎం, వైద్యఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నాని, మంత్రి కురసాల కన్నబాబు, రాజమండ్రి ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి, జిఎస్ఎల్ కోవిడ్ ఆస్పత్రి , హోం ఐసోలేషన్ లో ఉన్న పాసిటివ్ పేషేంట్లతో జూమ్ యాప్ లో మాట్లాడ్తున్న మంత్రులు.

2020-07-29 05:52 GMT

అమరావతి: సచివాలయం నాల్గవ బ్లాక్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ. వెదపండితుల ఆశీర్వచనాలతో సతీ సమేతంగా పూజలు చేసిన మంత్రి శంకరనారాయణ.

మంత్రి శంకర్ నారాయణ: ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా వుంది. సిఎం జగన్ నాకు ఆర్ అండ్ బి శాఖ‌ కేటాయించినందుకు ధన్యవాదాలు. వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలు అమలు లో నన్ను ముఖ్య భాగస్వామిని చేశారు. మొదటి సారిగా గెలిచిన నన్ను బిసి సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. ఈ రోజు‌ కీలక శాఖలు‌ ఎస్సీ ఎస్టీ బలహీన. మైనారిటీ వర్గాలకు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు చేసేందుకు గాను 6400 కోట్లతో మూడు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కు ఎన్డీబి తో ఒప్పందం పై మెదటి సంతకము చేశాను.


2020-07-29 04:35 GMT

నేడు మల్లారం గ్రామానికి బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

- నేడు మల్లారం గ్రామానికి బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం రాక.

- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే రాజసింగ్, ఎమ్మెల్సీ రాంచంధర్ రావు, మాజీ ఎంపీ వివేక్, చింత సాంబమూర్తి లు రానున్నారు.

- గ్రామంలో దళిత యువకుడు రాజబాబును టిఆర్ ఎస్ నేతలు హత్య చేయడంపై బీజేపీ బృందం నిజానిర్దన చేసి గవర్నర్ కు నివేదిక ఇవ్వనున్నారు

2020-07-29 04:34 GMT

కర్నూలు జిల్లా: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అత్యవసర పరిస్థితులలో 5 జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం. 0.329 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 638 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన AP జెన్కో అధికారులు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అత్యవసర విద్యుదుత్పత్తి అనంతరం నిలిపివేసిన జల విద్యుత్ ఉత్పత్తి. తెలంగాణ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. 6 జనరేటర్ల ద్వారా 20.350 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 42,145 నీటిని విడుదల.

2020-07-29 04:33 GMT

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో మరొక వ్యక్తి కరోనా లక్షణాలతో తెల్లవారుజామున మృతి... నిన్న రాత్రి తీవ్ర అనారోగ్యంతో మంచిర్యాల నుంచి బెల్లంపల్లికి తరలించిన అధికారులు, మృతుడు రిటైర్డ్ సింగరేణి కార్మికుడు,బెల్లంపల్లి పట్టణం ఇంక్లైన్ రాడగంబల బస్తి స్వస్థలం.


2020-07-29 04:33 GMT

కర్నూలు జిల్లా : నంద్యాల సమీపంలో ప్రమాదం. లారీని డీ కొన్న కారు, కారులో మంటలు, కారులో నుంచి దూకిన ముగ్గురు, ఒకరు తప్పించుకోలేక కారులోనే చిక్కుకొని మృతి. మృతి చెందిన వ్యక్తి నంద్యాల SBI బ్యాంక్ క్లర్క్ శివ కుమార్. మృతుని తల్లి వైద్య చికిత్స కోసం కర్నూలు కు వెళ్లి గత అర్థరాత్రి తిరిగి నంద్యాల కు వచ్చే సమయంలో కారు ప్రమాదం. నంద్యాల సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రి వద్ద ముందు వెళ్తున్న లారీని డీ కొన్న కారు. కారులో మంటలు ఒకరు మృతి, ముగ్గురికి గయాలు. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పిన నంద్యాల తాలుక పోలీసులు.

2020-07-29 04:32 GMT

వరంగల్ అర్బన్: జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్. కమ్యూనిటీ స్ప్రెడ్ దిశగా అడుగులు వేస్తున్న కోవిడ్ 19. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 138 కోవిద్ 19 పాజిటివ్ కేసులు నమోదు.

2020-07-29 04:31 GMT

విశాఖ: కన్న కుమార్తె (14)పైనే అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన తండ్రి. బాలిక అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్ష చేయగా గర్భం దాల్చినట్లు నిర్ధారణ. విశాఖ రైల్వేన్యూకాలనీలో బాధిత బాలిక, తండ్రి, నానమ్మ, తాతయ్య కలిసి నివాసం. తల్లి ఇటీవలే అనారోగ్యంతో మృతి. బాలికకు మాయమాటలు చెప్పి ఐదు నెలలుగా ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడిన కసాయి తండ్రి. తండ్రి నిర్వాకం అని తేలడంతో నాలుగో పట్టణ పోలీసులకు కుటుంబీకుల ఫిర్యాదు. దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ కేసు దర్యాప్తు

2020-07-29 03:34 GMT

తూర్పుగోదావరిజిల్లా పులిదిండిలో అక్రమ ఇసుక ర్యాంప్

తూర్పుగోదావరి -రాజమండ్రి

- ఆత్రేయపురం మం పులిదిండి ఇసుక ర్యాంపులో అక్రమాలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్పీ సుమిత్‌గురు దాడులు

- అనుమతులు లేని ప్రాంతంలో ఇసుక దందా చేస్తున్నట్టు నిర్ధారణ

- నిర్వహకుడుతో పాటు ముగ్గురిపై కేసు నమోదు

- పొదల్లో దాచిన జేసీబీ స్వాధీనం

- 2,500 మెట్రిక్‌టన్నుల ఇసుక సీజ్‌ చేసిన అధికారులు

- పులిదిండి ప్రాంతంలో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తింపు

- ర్యాంపు ఎప్పుడో మూతపడినా అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా చేస్తున్న నిర్వహకులు

- అనుమతి ఇచ్చిన ప్రాంతంలో కాకుండా అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక తవ్వినట్లు గుర్తింపు

2020-07-29 02:00 GMT

శ్రీశైలంలో మరో ఐదురోజుల పాటు దర్శనాలు నిలిపివేత

- శ్రీశైల దేవస్థానంలో భక్తుల దర్శనాలను మరొక 5 రోజుల వరకు నిలుపుదల

- శ్రీశైల క్షేత్రం లో కరోన రోజు రోజు కూ వైరస్ విజృంభిస్తున్న నేపధ్యం లో ఈనెల 15వ తేదీ నుండి ఆలయ దర్శనాలు నిలిపివేసిన శ్రీశైల దేవస్థానం.

- యధావిధిగా స్వామి అమ్మవార్ల కైంకర్యాల నిర్వహణ, భక్తుల సౌకర్యార్థం పరోక్ష సేవలను యధావిధిగా కొనసాగిస్తున్న అధికారులు.

Tags:    

Similar News