Live Updates:ఈరోజు (జూలై-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శుక్రవారం, 24 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చవితి (సా. 4-39 వరకు) తర్వాత పంచమి, పుబ్బ నక్షత్రం (సా. 6-50 వరకు) తర్వాత ఉత్తర నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 1-35 నుంచి 3-06 వరకు తె.వ. 3-40 నుంచి 5-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32
ఈరోజు తాజా వార్తలు
- నేడు తెలంగాణలో కొత్తగా 1640 కేసులు.
- కరోనాతో పోరాడి 24 గడిచిన గంటల్లో 8 మంది మృతిచెందారు.
- రాష్ట్రంలో 52, 446కు చేరిన కరోనా కేసులు.
- ఇప్పటివరకు కరోనాతో పోరాడి 455 మంది మృతిచెందారు.
- రాష్ట్రంలో ఇప్పటివరకు 40,337 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- ప్రస్తుతం 11,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇక భారత్ లో అయితే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత అయితే రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం కొంచం ఆశాజనకంగా కనిపిస్తుంది.. ఇక అటు ఈ కరోనాకి వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో నిమగ్నం అయి ఉన్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు..
ఉరవకొండ: పట్టణ సమీపంలో కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఉరవకొండ పోలీసులు పట్టుకున్నారు.
- ఎన్.హెచ్ 42 అనంతపురం - బళ్లారి రహదారిలో వాహనాలు తనిఖీలో భాగంగా ఓ వ్యక్తి అక్రమంగా 382 టెట్రా కర్ణాటక మద్యం ప్యాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని ఉరవకొండ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ధరణిబాబు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.
- మద్యం ప్యాకెట్లు విలులు దాదాపు రూ.16,170 ఉంటుందని తెలిపారు.
- నింబగల్లు గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
- కరోనా మహమ్మారి పాలమూరు వాసులను బెంబేలెత్తిస్తోంది.
- రోజు రొజుకూ పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
- పల్లెలు, పట్టణాలు అనే తేడ లేకుండా కోవిడ్ బాదితులు పెరిగిపోవడంతో స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోతున్నారు జనం.
- వాణిజ్య, వ్యాపార సంస్థలు సైతం సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
నటుడు ప్రకాష్ రాజ్.. డియర్ ఫ్రెండ్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు మరింత ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
- తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- విద్యార్థులందరికీ 35 మార్కులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
- ప్రభుత్వ నిర్ణయంతో పదో తరగతిలో 35 వేలు, ఇంటర్‌లో 43 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది.
- కరోనా వ్యాప్తి దృష్ట్యా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఓసెన్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర శర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే.
- ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తపేట: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధ్వజమెత్తారు. కొత్తపేట మండలం వాడపాలెంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి వర్చువల్ యాజిటేషన్ నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా వైరస్ నియంత్రించడంలో ముందు చూపు కొరవడి ప్రభుత్వం ప్రజలకు సమస్యలను తెచ్చిందన్నారు. తొలుత పరీక్షలు నిర్వహణ ఆలస్యం చేసి కేసులు పెరిగాక సంజీవిని బస్సులు తెచ్చిందన్నారు. కరోనాతో సహజీవనం తప్పదంటూ చెప్పారు సరే నియంత్రణ చర్యలుపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించక పోవడంతో ప్రైవేటు ఆసుపత్రులుకు వెళ్ళాల్సి వస్తుందని.. వెళ్లిన రోగులను పరీక్షలు పేరుతో తిప్పుతుండటంతో పలువురు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కరోనాపై తగు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తోందన్నారు.
అరకులోయ: మండలంలో స్వచ్ఛంద లాక్ డౌన్ కొనసాగుతోంది. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ పిలుపు మేరకు లాక్డౌన్ అమలవుతోంది. వర్తక వాణిజ్య దుకాణాలన్నీ మూతపడ్డాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు శుక్రవారమైనా సంతకు రాలేదు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
కరోనా వ్యాప్తిని కట్టడికై అరకులోయలో ఒక రోజు లాక్డౌన్ అమలు చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. వారపు సంత జరిగే శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల రాకపోకలను ఆపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
విశాఖపట్నం: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు ఆగస్టు 15వ తేదీకి పొడగించినట్లు విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి తెలిపారు. apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.
బీసీ, ఓసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులు రూ.50 చలానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 9494888617, 9441270099 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
- మానవత్వాన్ని మర్చిపోయేలా చేస్తున్న కరోనా.
- గ్రామంలోకి అనుమితించని స్థానికులు.
- అనారోగ్యంతో చనిపోయిన మహిళా ముతదేహాన్ని ఊరిలోకి రానివ్వని వైనం.
- టెస్టులో నెగటివ్ వచ్చినా ఊరిలోకి రానివ్వని గ్రామస్తులు.
- సీఐతో గ్రామస్తులు వాగ్వాదం.