కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే బండారు

కొత్తపేట: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధ్వజమెత్తారు. కొత్తపేట మండలం వాడపాలెంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి వర్చువల్ యాజిటేషన్ నిర్వహించారు.

- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా వైరస్ నియంత్రించడంలో ముందు చూపు కొరవడి ప్రభుత్వం ప్రజలకు సమస్యలను తెచ్చిందన్నారు. తొలుత పరీక్షలు నిర్వహణ ఆలస్యం చేసి కేసులు పెరిగాక సంజీవిని బస్సులు తెచ్చిందన్నారు. కరోనాతో సహజీవనం తప్పదంటూ చెప్పారు సరే నియంత్రణ చర్యలుపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు.

- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించక పోవడంతో ప్రైవేటు ఆసుపత్రులుకు వెళ్ళాల్సి వస్తుందని.. వెళ్లిన రోగులను పరీక్షలు పేరుతో తిప్పుతుండటంతో పలువురు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కరోనాపై తగు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తోందన్నారు.



Update: 2020-07-24 13:48 GMT

Linked news