Live Updates:ఈరోజు (జూలై-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-07-08 01:53 GMT
Live Updates - Page 2
2020-07-08 05:16 GMT

కేజీహెచ్ క్లినికల్ ట్రెయిల్స్ పై కొనసాగుతున్న ఉత్కంఠ

- క్లినికల్ ట్రెయిల్స్ కు రాని అనుమతులు

- ప్రభుత్వనికి ప్రతిపాదనలు పంపనున్న అధికారులు

- అత్యంత కీలకమైన పరిశోధన కావడంతో ప్రభుత్వ అనుమతులు సైతం తీసుకోవాలని తెలిపిన డిఎంఈ

- క్లినికల్ ట్రెయిల్స్ పై కేజీహెచ్ ను సంప్రదించిన ఆక్స్ఫర్డ్ సంస్థ

2020-07-08 05:11 GMT

నెల్లూరు జిల్లాలో సీఐల బదిలీలు....

 అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద బదిలీ చేసిన గుంటూరు రేంజ్ ఐజి....



 

2020-07-08 05:07 GMT

వైఎస్ఆర్ విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో వైఎస్ఆర్ విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు. పంజాగుట్టలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన టిపిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి ,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కెవిపి రామచంద్ర రావు, మాజీ పిసిసి పొన్నాల లక్ష్మయ్య అంజన్ కుమార్ యాదవ్, వంశీచంద్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ పలువురు నేతలు..

- టిపిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి

- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ పాపులర్ లీడర్ వైయస్సార్..

- వైస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు భారత దేశ వ్యాప్తంగా పాలకుల అందరూ పాటిస్తున్నారు..

- వైయస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయం..

- 2023 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..

- ఆ విధంగా మేము కృషి చేస్తాము..

- రైతులకు ,యువతకు, విద్యార్థులకు, మహిళలకు ,వైయస్ రాజశేఖర్రెడ్డి ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేశారు.



2020-07-08 05:06 GMT

సంక్షేమం ఎలా ఉంటుందో ప్రపంచానికి సాటి చెప్పిన గొప్ప నేత రాజశేఖర్ రెడ్డి: సజ్జల రామకృష్ణ రెడ్డి

- ప్రజల మనిషి, ప్రజలు మెచ్చిన మనిషి వైఎస్ రాజశేఖరరెడ్డి..

- చరిత్రలో మర్చిపోలేని వైఎస్ రాజశేఖరరెడ్డి..

- భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకొనే వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి..

- రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి..

- రైతాంగానికి స్వర్గ సీమగా ఆంద్రప్రదేశ్ ను రాజశేఖర్ రెడ్డి మార్చారు..

- రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని దేశ వ్యాప్తంగా చేయాలి..

- రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు..

- వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన సీఎం జగన్ ధన్యుడు..

- రాజశేఖర్ రెడ్డి కుమారునిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండడం మన అదృష్టం..

- ఇచ్చిన హామీలను దాదాపు ఏడాదిలోనే సీఎం జగన్ అమలు చేశారు..

- ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను సీఎం జగన్ అమలు చేశారు..

- తండ్రి బాటలోనే సంక్షేమంకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు..

- అమ్మ ఒడి ద్వారా ప్రతి తల్లి ఖాతాకు 15000 సీఎం జగన్ వేశారు..

- ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్యను 2000లకు పెంచారు..

- 108, 104 వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారు..

2020-07-08 05:04 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడ: గూడూరు నారాయణ రెడ్డి, పీసీసీ కోశాధికారి

- ప్రజలకు దూరంగా ఉండే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఆచూకీ లభ్యం కావడం లేదు

- గత నెల చివర వారం నుంచి ఆయన కనిపించడం లేదు

- ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారిన పడ్డారని, అందువల్లనే వ్యక్తిగత నిర్బంధంలోకి వెళ్లారన్న వార్తలు వస్తున్నాయి

- ముఖ్యమంత్రి ఏమయ్యాడన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి

- తక్షణమే సీఎం అజ్ఞాతం వీడి తన ఆరోగ్యంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి

- స్వయాన ప్రభుత్వ పెద్దలే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు

- కార్పోరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన హోంమంత్రి మహమూద్ అలీ అబద్దాలు కోరు

- తులసి ఆకులతో తాను కరోనా నుంచి బయట పడ్డానని చెప్పడంలో వాస్తవం లేదు

- కేసీఆర్‌ ప్రజా పరిపాలన అందించే ముఖ్యమంత్రినా లేక ఈ రాష్ట్రానికి... రాజునా

- ముఖ్యమంత్రి కేసీఆర్‌ గడిచిన ఆరు సంవత్సరాలుగా ప్రజలకు దూరంగా రహస్య ప్రదేశానికి వెళ్ళే అలవాటుంది

- అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ప్రత్యక్షమవుతుంటాడు.

- ఇటీవల తిరిగి లాక్‌డౌన్‌ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మీడియాకు ప్రకటన విడుదల చేశారు

- కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ తిరిగి పెడితే ఎప్పటి వరకు ఉంటుందో తెలియని పరిస్థితి

- మళ్లీ ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రజలు ...నగరం వదిలి పల్లెలకు వెళ్లిపోయారు

- ఇక్కడున్న వారు కూడా సరుకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు

- ఇప్పటి వరకు లాక్‌డౌన్‌పై స్పష్టత లేదు.....అసలు పెడతారో....లేదో కూడా తెలియదు

- లాక్‌డౌన్‌ దెబ్బతో...రాబడులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

- ప్రతి రోజు కరోనా కేసులు పెరుగుతున్నందున....పాజిటివ్‌ వచ్చిన వారు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి

- ప్రయివేటు ఆస్పత్రులకెళ్లితే...భారీ ఎత్తున బిల్లులు వేస్తుండడంతో భరించలేకపోతున్నారు

- ప్రయివేటు ఆస్పత్రులు... ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.... ప్రభుత్వ జీవోను లెక్క చేయడం లేదు

- ప్రయివేటు కార్పోరేటు ఆస్పత్రులు అనునసరిస్తున్న తీరును హైకోర్టు సైతం తప్పుబట్టింది

- ప్రభుత్వ జీవోను అపహస్యం చేస్తున్నాయి, వాటిపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందని ప్రశ్నించిన న్యాయస్థానం

- నాలుగు కార్పోరేటు ఆస్పత్రులకు నోటీసులు కూడా ఇచ్చిందంటే పరిస్థితులు ఏలా ఉన్నాయో

- పాత సచివాలయాన్ని మెరుపు వేగంతో కూల్చాల్సిన అవసరం ఏమిటి

- ఆరు నెలలపాటు వాయిదా వేసి కరోనా క్వారంటైన్‌ కేంద్రంగాకాని, కోవిడ్‌ ఆస్పత్రిగాకాని ఎందుకు వాడకూడదు

- రోజు రోజుకు కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది...ప్రజలు విలవిలలాడుతున్నారు

- క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఎందుకు ప్రయత్నించడంలేదు

- హైదరారబాద్‌ నగరంలో పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు జరుగుతున్నాయి.... ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదు

- గుండెపోటుతో చనిపోతున్నట్లు చూపి..కరోనా మరణాలను తక్కువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంగా కనిపిస్తోంది

- కొంత మంది నిజాయితీ అధికారుల వల్లనే రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది

- రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్పృహలో ఉన్నారని... మంత్రిమండలిలో ఉన్న వారిలో ఎక్కువ మంది మంత్రులు డమ్మీలే

- మాట్లాడగలిగే మంత్రులైనా... స్పందించాలి...రాష్ట్రంలో జరుగుతున్న పాలన తీరుపై మాట్లాడాలి

- ప్లాస్మా దాతల సంఘం ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన నేను ...ఆరోగ్య మంత్రి ఈటల కోసం వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు

- కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యంపై ప్రతిపక్షంగా పోరాటం ఉదృతం చేసి ఒత్తిడి తెస్తాం.

- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 లక్షల పరీక్షలు చేస్తే.... ఇక్కడ ఎందుకు లక్ష పరీక్షలే జరిగాయి... పరీక్షలు ఎందుకు ఎక్కువ చేయలేకపోతున్నారు

- కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఏపీ ప్రభుత్వం వెయ్యికిపైగా అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తే...ఇక్కడ జిల్లాకు ఒకటైనా ఏర్పాటు చేయలేదు.

- అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు కనీసం అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు.

- రోగనిరోధక శక్తిని మెరుగుపరచమని ప్రజల్లో ప్రభుత్వం అవగాహన కల్పించాల్సి ఉంది

- రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు ప్రజలు నిమ్మజాతి పండ్లను, ప్రొటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి

2020-07-08 05:01 GMT

విశాఖ బీచ్ లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులు.

- పూల మాల వేసిన నివాళి అర్పించిన విజయసాయిరెడ్డి,మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.

- ఎం పి విజయసాయి రెడ్డి కామెంట్స్

- రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.

- రాజశేఖర్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు.

- బడుగు బలహీన వర్గాల వారికి పెద్ద పీట వేశారు.

- ఆరోగ్య శ్రీ పథకంతో ప్రతి పేదవాడికి వైద్య సేవలు అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది.

- రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది.

- మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కామెంట్స్

- రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో స్థిర స్థాయిలో నిలిచిపోయారు.

- సంవత్సర కాలంగా చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.

2020-07-08 04:16 GMT

బడుగు, బలహీన వర్గాల అరాధ్యదైవం వైఎస్సార్

నేడు వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇక దివంగత మహానేత వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ రాసిన ''నాలో... నాతో... వైఎస్సార్‌'' పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైఎస్సార్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం.

- పూర్తి వివరాలు 



2020-07-08 03:10 GMT

గుడివాడ రోడ్డులో లారీ, ఆటో ఢీ.. ఒకరికి గాయాలు

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వెళ్లే రోడ్డు పెరికీడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో ఆస్పత్రికి తరలించారు.

2020-07-08 02:06 GMT

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో..

నిజామాబాద్ : ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతున్న 3152 క్యూసెక్కుల వరద నీరు.

- ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

- ప్రస్తుతం 1071 అడుగుల 32.టి.ఎం.సి.ల నీటి నిల్వ.

2020-07-08 02:05 GMT

నేటి నుంచి వారం రోజుల పాటు మద్నూర్ లో స్వచ్చంధ లాక్ డౌన్.

కామారెడ్డి : మండలం లో పాజిటివ్ కేసులు నమోదు కావడం తో వ్యాపారులు నిర్ణయం.

- ఉదయం 6 నుంచి 11 గంటల వరకు వ్యాపారాల నిర్వహణ.

- వారం పాటు సెలూన్ల మూసివేత.

Tags:    

Similar News