ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ: గూడూరు నారాయణ రెడ్డి, పీసీసీ కోశాధికారి
- ప్రజలకు దూరంగా ఉండే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఆచూకీ లభ్యం కావడం లేదు
- గత నెల చివర వారం నుంచి ఆయన కనిపించడం లేదు
- ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారని, అందువల్లనే వ్యక్తిగత నిర్బంధంలోకి వెళ్లారన్న వార్తలు వస్తున్నాయి
- ముఖ్యమంత్రి ఏమయ్యాడన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి
- తక్షణమే సీఎం అజ్ఞాతం వీడి తన ఆరోగ్యంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి
- స్వయాన ప్రభుత్వ పెద్దలే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు
- కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన హోంమంత్రి మహమూద్ అలీ అబద్దాలు కోరు
- తులసి ఆకులతో తాను కరోనా నుంచి బయట పడ్డానని చెప్పడంలో వాస్తవం లేదు
- కేసీఆర్ ప్రజా పరిపాలన అందించే ముఖ్యమంత్రినా లేక ఈ రాష్ట్రానికి... రాజునా
- ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన ఆరు సంవత్సరాలుగా ప్రజలకు దూరంగా రహస్య ప్రదేశానికి వెళ్ళే అలవాటుంది
- అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ప్రత్యక్షమవుతుంటాడు.
- ఇటీవల తిరిగి లాక్‌డౌన్ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మీడియాకు ప్రకటన విడుదల చేశారు
- కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ తిరిగి పెడితే ఎప్పటి వరకు ఉంటుందో తెలియని పరిస్థితి
- మళ్లీ ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రజలు ...నగరం వదిలి పల్లెలకు వెళ్లిపోయారు
- ఇక్కడున్న వారు కూడా సరుకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు
- ఇప్పటి వరకు లాక్‌డౌన్‌పై స్పష్టత లేదు.....అసలు పెడతారో....లేదో కూడా తెలియదు
- లాక్‌డౌన్ దెబ్బతో...రాబడులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
- ప్రతి రోజు కరోనా కేసులు పెరుగుతున్నందున....పాజిటివ్ వచ్చిన వారు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి
- ప్రయివేటు ఆస్పత్రులకెళ్లితే...భారీ ఎత్తున బిల్లులు వేస్తుండడంతో భరించలేకపోతున్నారు
- ప్రయివేటు ఆస్పత్రులు... ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.... ప్రభుత్వ జీవోను లెక్క చేయడం లేదు
- ప్రయివేటు కార్పోరేటు ఆస్పత్రులు అనునసరిస్తున్న తీరును హైకోర్టు సైతం తప్పుబట్టింది
- ప్రభుత్వ జీవోను అపహస్యం చేస్తున్నాయి, వాటిపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందని ప్రశ్నించిన న్యాయస్థానం
- నాలుగు కార్పోరేటు ఆస్పత్రులకు నోటీసులు కూడా ఇచ్చిందంటే పరిస్థితులు ఏలా ఉన్నాయో
- పాత సచివాలయాన్ని మెరుపు వేగంతో కూల్చాల్సిన అవసరం ఏమిటి
- ఆరు నెలలపాటు వాయిదా వేసి కరోనా క్వారంటైన్ కేంద్రంగాకాని, కోవిడ్ ఆస్పత్రిగాకాని ఎందుకు వాడకూడదు
- రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది...ప్రజలు విలవిలలాడుతున్నారు
- క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు ప్రయత్నించడంలేదు
- హైదరారబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు జరుగుతున్నాయి.... ప్రభుత్వ లెక్కల్లోకి రావడం లేదు
- గుండెపోటుతో చనిపోతున్నట్లు చూపి..కరోనా మరణాలను తక్కువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంగా కనిపిస్తోంది
- కొంత మంది నిజాయితీ అధికారుల వల్లనే రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది
- రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్పృహలో ఉన్నారని... మంత్రిమండలిలో ఉన్న వారిలో ఎక్కువ మంది మంత్రులు డమ్మీలే
- మాట్లాడగలిగే మంత్రులైనా... స్పందించాలి...రాష్ట్రంలో జరుగుతున్న పాలన తీరుపై మాట్లాడాలి
- ప్లాస్మా దాతల సంఘం ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన నేను ...ఆరోగ్య మంత్రి ఈటల కోసం వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు
- కరోనా నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యంపై ప్రతిపక్షంగా పోరాటం ఉదృతం చేసి ఒత్తిడి తెస్తాం.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 లక్షల పరీక్షలు చేస్తే.... ఇక్కడ ఎందుకు లక్ష పరీక్షలే జరిగాయి... పరీక్షలు ఎందుకు ఎక్కువ చేయలేకపోతున్నారు
- కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఏపీ ప్రభుత్వం వెయ్యికిపైగా అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తే...ఇక్కడ జిల్లాకు ఒకటైనా ఏర్పాటు చేయలేదు.
- అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు కనీసం అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు.
- రోగనిరోధక శక్తిని మెరుగుపరచమని ప్రజల్లో ప్రభుత్వం అవగాహన కల్పించాల్సి ఉంది
- రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు ప్రజలు నిమ్మజాతి పండ్లను, ప్రొటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి