ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ ర్యాలీ
- తిరుపతిలో డప్పులు వాయిద్యాలతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ ర్యాలీ
- వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి
విశాఖ రాజధాని పై భద్రత అంశాలకు సంబంధించి కమిటీ
- నగర పోలిస్ కమీషనర్ తో పాటు 8 మంది సభ్యులను నియమించిన డీజీపీ గౌతమ్ సావంగ్
- ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఇతర మంత్రులూ అధికారుల భధ్రతా అంశాల పై నివేదిక కోరిన డీజీపీ
- ఇప్పటికే విశాఖలో రెండు పర్యాయాలు పర్యటన చేసిన డీజీపీ
- దీంతో రాజధాని ప్రక్రియ కు విశాఖ లో తొలి అడుగు.
అమెరికాలో రెండు విమానాలు ఢీ..ఆరుగురి మృతి
అమెరికాలోని అలస్కాలో రెండు తేలికపాటి విమానాలు ఢీకొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఓ విమానంలో పైలట్ ఒక్కరే ఉండగా.. మరో విమానంలో ఆరుగురు ప్రయాణిస్తున్నట్టు భద్రతాధికారులు వెల్లడించారు.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 8:27కి సోల్డోట్నా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆరుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు.
మృతిచెందిన వారిలో అలస్కా చట్టసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత గ్యారీ నాప్ కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంపై జాతీయ రవాణా భద్రతా మండలి (ఎన్‌టీఎస్‌బీ) విచారణ చేపట్టింది.
రాజధాని గ్రామాల్లో భారీగా మోహరించిన పోలీసు బలగాలు.
అమరావతి
- కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళనలో చేయవద్దని పోలీసుల ప్రచారం
- 29 గ్రామాల్లో ఇళ్ల నుంచి ఎవరు బయటకు పహారా కాస్తున్న పోలీసులు.
- నేడు దీక్ష శిబిరాల వద్ద భారీ ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చిన రాజధాని జేఏసీ.
- మూడు రాజదానులకు వ్యతిరేకంగా నేడు ఆందోళనలకు సిద్ధమైన రైతులు.
- బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం, గ్రామాల్లోకి పోలీస్ ల రాకతో మరోసారి ఉద్రిక్తంగ మారిన రాజధాని గ్రామాలు.
- రాత్రుళ్ళు జేఏసీ నేతల ఇళ్లపై నిఘా పెట్టిన పోలీసులు.
కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారగా అనిల్ కుమార్
కడప జిల్లా...
జిల్లా వ్తెద్యాఆరోగ్యశాఖ అధికారి డి ఎం హెచ్ ఓ గా అనిల్ కుమార్ నియామకం....
అనంతపురం లో పని చేస్తూ కడపకు బదిలీ పై వస్తున్న అనిల్ కుమార్....
జిల్లా డి ఎం హెచ్ ఓ గా పని చేస్తున్న ఉమా సుందరి పదవి విరమణ పొందడంతొ నూతన వైద్య అధికారిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతిలో నిరసనలు
అమరావతి
సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఆమోదంతో అమరావతిలో నిరసనలు
అమరావతి ప్రాంత రైతుల నిరసనల వెల్లువ
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాల మోహరింపు
మూడు రాజదానులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందన
అమరావతి...
పరిపాలనా వికేంద్రీకరణ,crda బిల్ రద్దు బిల్ లు ఆమోదం పై వైసీపీ ప్రధాన కార్యదర్శి,పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పందన
గవర్నర్ నిర్ణయం చారిత్రాత్మికం
ఇక ప్రపంచ పట్టంలో వైజాగ్ కి,ఏపీకి ప్రత్యేక గుర్తింపు
పరుగులు పెట్టనున్న పారిశ్రామిక,సేవారంగా ప్రగతి
ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర సర్వతో ముఖాబివృద్ధికి సీఎం జగన్ కంకణం
అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం.
హైదరాబాద్ లో జరుగుతున్న బక్రీద్ వేడుకలు
కోవిడ్ నిబంధనల ప్రకారం మజీద్, ఈద్గా ల వద్ద సానిటైజేషన్ స్ప్రే లను ఏర్పాటు చేసిన ghmc
నమాజ్ కు వచ్చే సమయంలో మాస్క్ లతో రావాలని, ఆలింగనాలు చేసుకోవద్దని విజ్ఞప్తి
భద్రాద్రి # కొత్తగూడెం
- ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న దమ్మపేట మండలానికి చెందిన కరోనా పాజిటివ్ రోగి పరారీ
- సిసి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బ్రేకింగ్...
హైదరాబాద్ అసిఫ్ నగర్ లోని ఓ ఫర్నిచర్ షాప్ పై గూండాల దాడి..
అసిఫ్ నగర్ జిహ్రా రోడ్డులో ఉన్న మెరాజ్ ఫర్నిచర్ షాప్ లోకి జొరబడి.. రాడ్లు,కటేళ్లు,రాళ్ల తో దాడి చేశారు..
ఈ దాడిలో షాప్ లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు.
ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అసిఫ్ నగర్ పోలీసులు.