Vishakha updates: విశాఖ స్టీల్ ప్లాంట్ కు " నేషనల్ ఎనర్జే లీడర్" అవార్డు..
విశాఖ..
-విశాఖ స్టీల్ ప్లాంట్ కు " నేషనల్ ఎనర్జే లీడర్" అవార్డు..
-రెండవ సారి ఈ అవార్డు దక్కించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ..
-సీఐఐ- జీబీసీ సంస్థలు ఆధ్వర్యంలో జాతీయ అత్యుత్తమ ఇంధన పరిరక్షణ సామర్థ్యం కలిగిన పరిశ్రమల అంశం లో విశాఖ స్టీల్ ప్లాంట్ కి దక్కిన అవార్డు..
Vijayawada updates: బెజవాడ సెంట్రల్ ఏసీపీ నాగ రాజా రెడ్డిపై సస్పెన్షన్ వేటు..
విజయవాడ....
-బెజవాడ సెంట్రల్ ఏసీపీ నాగ రాజా రెడ్డిపై సస్పెన్షన్ వేటు
-పటమట పీఎస్ పరిధిలో భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి చెందిన కేసులో బిల్డర్ నుంచి డబ్బులు వసూలు ఆరోపణలు
-డీజీపీకి ఫిర్యాదు చేసిన బిల్డర్
-విచారణ చేసి నిర్ధారణ చేసిన సీపీ బత్తిని శ్రీనివాసులు
-సీపీ నివేదికతో ఏసీపీ నాగ రాజారెడ్డి పై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు
Anantapur district updates: నేడు బీజేపీ ఆధ్వర్యంలో “ప్రకృతి వందనం “
అనంతపురం:
-నేడు బీజేపీ ఆధ్వర్యంలో “ప్రకృతి వందనం “
-పర్యావరణ అవగాహన కార్యక్రమము.
-ఇస్కాన్ టెంపుల్ వెనుక నిర్మాణంలో వున్న బిజెపి కార్యాలయం వద్ద మొక్కలు నాటనున్న బీజేపీ నేతలు.
Srisailam Reservoir updates: శ్రీశైలం జలాశయంలో పూర్తిగా తగ్గుతున్న వరద
కర్నూలు జిల్లా....
-శ్రీశైలం జలాశయంలో పూర్తిగా తగ్గుతున్న వరద
-ఇన్ ఫ్లో : 25,387 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 37,026క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
-ప్రస్తుత : 884.800 అడుగులు
-నీటి నిల్వ సామర్ధ్యం : 215.807 టిఎంసీలు
-ప్రస్తుతం : 214.8450 టీఎంసీలు
-పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లనుండి 35,000
-హంద్రీనీవా సుజల స్రవంతి 2026
-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ను నిలిపి వేసిన విద్యుత్ ఉత్పత్తి
Kurnool updates: కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జనం
కర్నూల్...
-కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జనం
-హైదరాబాద్ తర్వాత గణేష్ ఉత్సవ నిర్వహణ విషయం లో కర్నూల్ రెండవ స్థానం
-కోవిడ్ నిబంధనలు పాటించి జరుగనున్న కార్యక్రమం
-నిమజ్జనానికి తరలి రానున్న ఐదు వందల విగ్రహాలు
-గతంలో మూడు నుండి ఐదు వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వచ్చేవి
-భారీ విగ్రహాల కు అనుమతి లేకపోవడంతో చిన్న విగ్రహాలనే ప్రతిష్టించి పూజలు చేసిన భక్తులు
-నగరంలోని కేసీ కెనాల్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-కేసీ కెనాల్ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
Kadapa District Updates: రాజంపేటలొ ఎరువుల దుకాణాల్లొ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు....
కడప :
-రాజంపేటలొ ఎరువుల దుకాణాల్లొ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు....
-నిర్వహణలొ లొపాలుండటంతొ దుకాణాల్లో ఎరువుల విక్రయాలను తాత్కాలింగా నిలుపుదల చేస్తూ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఉమామహేశ్వర్ అదేశాలు...
Kadapa District Updates: అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత
కడప :
-చిట్వేలి మండలం సలివెందుల బీటులోని ఊరగాయకుప్ప సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత
-నలుగురిని అదుపులొకి తీసుకుని 14 దుంగలను స్వాధీనం చేసుకున్న అటవీశాఖాధికారులు
Kadapa District Updates: స్వాతంత్య్ర సమరయోధుడు గాంధేయవాది జొన్నలగడ్డ రంగయ్య (101) మృతి ...
కడప :
-లింగాల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు గాంధేయవాది జొన్నలగడ్డ రంగయ్య (101) మృతి ...
-బాల్య దశలోనే గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఆయన సభలు ఎక్కడ పెట్టినా వెళ్లిన రంగయ్య...
-స్వాతంత్య్ర పోరాటం కోసం పలుమార్లు జైలుపాలైన రంగయ్య
-ఆగస్టు 15, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల విద్యార్థులకు మిఠాయిలు, నగదు వితరణగా అందచేస్తు వచ్చిన రంగయ్య...