Live Updates: ఈరోజు (ఆగస్ట్-30) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం, 30 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ద్వాదశి (ఉ. 9-05 వరకు) తదుపరి త్రయోదశి, ఉత్తరాషాఢ నక్షత్రం (మ. 3-32 వరకు) తదుపరి శ్రవణ, అమృత ఘడియలు (ఉ. 9-05 నుంచి 10-42 వరకు తిరిగి తె. 5-19 నుండి) వర్జ్యం (రాత్రి 7-35 నుంచి 9-12 వరకు) దుర్ముహూర్తం (సా. 4-34 నుంచి 5-24 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-14
ఈరోజు తాజా వార్తలు
అమరావతి..
-జోగి రమేష్....వైసీపీ ఎమ్మెల్యే..
-ప్రభుత్వం పై చంద్రబాబు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
-చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన ఫలితం లేదు.
-సివిల్ servents ల పైన కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
-కష్టపడి పని చేస్తున్న కలెక్టర్ల పై విషం చిమ్ముతున్నారు.
-ప్రభుత్వం,ysr కాంగ్రెస్ పార్ట్ ని చంద్రబాబు ఎం చేయలేకపోయారు.
-అధికారులు పై పడి హాని ప్రయోగం అంటూ తప్పుడు మాటలు మాట్లాడ్తున్నారు.
-ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు పై కేసులు పెట్టాలి.
-చంద్రబాబు నికృష్టమైన పనులు చేస్తున్నారు,జైల్ కి పంపించాలి
అమరావతి...
-ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..
-ఏడాదిలోనే ఎవరూ వూహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన.
-అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి రూ.41,718కోట్లు లభ్ది.
-90% హామీలు అమలు.
-ఏడాది పాలనపై ప్రజల వద్దకు మేనిఫెస్టో,ప్రోగ్రెస్ రిపోర్ట్.
-మేనిఫెస్టోను మాయంచేసిన బాబెక్కడ? ప్రజలకే తన ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతున్న జగన్ గారెక్కడ?
శ్రీకాకుళం జిల్లా..
-నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరుగుతున్న వైనం..
-కంటైన్మెంట్ జోన్లలో నుంచి బయటకు వస్తున్న ప్రజలు..
-చెక్ పాయింట్లు పెట్టి కట్టడి చేస్తున్న పోలీసులు..
-పోలీసులను తప్పించుకుని మారు మార్గాల్లో సంచరిస్తున్న నగర వాసులు..
తూర్పుగోదావరి జిల్లా...... చింతూరు...
-చింతూరు మండలం మోతుగుడెం వద్ద భారీగా గంజాయి పట్టివేత..
-కోటి రూపాయల విలువ గల గంజాయి, 4 లక్షల 25 వేలు నగదు స్వాధీనం
-ఆరుగురు వ్యక్తులు అరెస్టు.. వ్యాను, కారూ సీజ్ చేసిన పోలీసులు
తూర్పుగోదావరి....
-కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ..
-వైద్యుల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
-అందువలన 14 రోజులపాటు నియోజకవర్గంలోనాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు నేరుగా అందుబాటులో ఉండనని మెసేజ్ లో విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
-గోదావరి వరదల వలన నష్టపోయిన రైతులకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముంపుప్రాంతాలలో జిల్లా మంత్రులు, అధికారులతో కలిసి విస్తృత పర్యటనలు
-ఈ పర్యటనల అనంతరం అస్వస్థతకు గురవ్వడంతో కోవిడ్ పరీక్షలు చేయిచుకోగా పాజిటివ్ నిర్థారణ అయింది
-వై.యస్.ఆర్.సి.పి.జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి
విజయవాడ....
-ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ సీఐడీ విచారణ నేడు
-వైద్యులపై ఏపీ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందంటున్న డాక్టర్ గంగాధర్
-కరోనా భయానక పరిస్ధితులలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సలహా ఇచ్చినందుకు డాక్టర్లపై చర్యలా - డాక్టర్ గంగాధర్
-పీపీఈ కిట్లు, మాస్కులు, కోవిడ్ ఎక్విప్మెంట్ లేవని అన్నందుకు కేసులు పెట్టడం అమానుషం - డాక్టర్ గంగాధర్
-కోవిడ్ కేర్ లో లోపాలు ఉన్నాయన్నందుకు కేసులు పెట్టారు - డాక్టర్ గంగాధర్
అమరావతి..
-టిడిపి నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఫోన్ చేసి పరామర్శించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
-అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న లోకేష్.
-త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన లోకేష్
-కోలుకున్న వెంటనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పై పోరాటం కొనసాగిస్తా అని లోకేష్ తో అన్న అచ్చెన్నాయుడు
తూర్పుగోదావరి..
-ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్లను ఎత్తివుంచిన అధికారులు
-2లక్షల 71 వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల
-ప్రస్తుతం వరద నీటిమట్టం 6.40 అడుగుల నీటిమట్టం
-ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో పది లక్షల క్యూసెక్కుల వరకూ మళ్ళీ వరద పెరిగే అవకాశం
అమరావతి..
-టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడికి చంద్రబాబు పరామర్శ.
-అచ్చెన్నకు ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు.
-అచ్చెన్నాయుడు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న చంద్రబాబు.
-త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు.
కర్నూలు జిల్లా..
-శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి
-ప్రధాన న్యాయమూర్తిని ఘనంగా ఆహ్వానం పలికిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా జడ్జిలు, ఆలయ కార్యనిర్వహణాధికారి ks రామారావు
-స్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చనాది పూజలు నిర్వహణ